వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీబీ డీజీపై వేటు: కొత్తగా పీఎస్సీఆర్‌కు బాధ్యతలు: సీఎం జగన్ ఆగ్రహమే కారణం!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైన బదిలీ వేటు వేసి ..ఆందరినీ షాక్ కు గురి చేసిన సీఎం ..ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ డీజీని బదిలీ చేసారు. రెండు రోజుల క్రితం ఏసీబీ పైన సమీక్షించిన సీఎం..ఆ శాఖ పరితీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో అవినీతి రహితంగా పాలన అందిస్తానంటూ తాను ఇచ్చిన మాటకు తగినట్లుగా..ప్రభుత్వ కార్యా లయాల్లో ఏసీబీ చురుగ్గా పని చేయటం లేదని ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. దీంతో..ఏకంగా ఏసీబీ డీజీ పైనే బదిలీ వేటు వేసారు. ఆయన స్థానంలో రవాణా శాఖ కమీషనర్ గా ఉన్న సీనియస్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులను ఏసీబీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీబీ డీజీ బదిలీ..సీఎం ఆగ్రహమే కారణం..
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఏసీబీ డీజీగా కుమార విశ్వజిత్ ను నియమించారు. ఆయనకు అదనంగా ఇంటలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు ఏపీలో ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు తెలంగాణ నుండి నేరుగా కేసీఆర్ తో మాట్లాడి రిలీవ్ చేయించారు. కానీ, కేంద్రం నుండి అనుమతి రాకపోవటంతో స్టీఫెన్ తిరిగి తెలంగాణలో కొనసాగుతున్నారు. దీంతో..కొద్ది రోజుల క్రితం మనీష్ కుమార్ సిన్హాను ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారు. దీంతో...కుమార విశ్వజిత్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. రెండు రోజుల క్రితం ఏసీబీ పైన సీఎం సమీక్షించారు. తన లక్ష్యాలకు అనుగుణంగా ఏసీబీ పని చేయటం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..సిబ్బందిలో మరింత సీరియస్ నెస్ పెంచేందుకు ఏకంగా ఏసీబీ డీజీ పైనే బదిలీ వేటు వేసారు. కానీ, బదిలీ చేసిన విశ్వజిత్ కు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

AP govt suddenly transferred ACB DG Kumar Vishwajeet..PSR Anjaneyulu appointed in his place

పీఎస్సార్ ఆంజనేయులుకు బాధ్యతలు..
ఇక, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాతక కేంద్ర సర్వీసుల్లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులను ఏపీకి తీసుకొచ్చారు. ఆయనకు రవాణా శాఖ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. దీనితో పాటుగా కీలకమైన ఏపీపీఎస్సీ కమిషనర్ గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారం వివాదాస్పదం కావటంతో..ఏపీపీఎస్సీ మొత్తం కార్యదర్శి పీఎస్సార్ ఆధీనంలోనే నడుస్తోంది. ఏపీపీఎస్సీలో కీలక నిర్ణయాలు..కొత్త షెడ్యూళ్లు..పరీక్షల నిర్వహణ పైన ఆయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. పీఎస్సార్ ఆంజనేయుల పైన నమ్మకం ఉన్న జగన్..తాను కోరుకుంటున్న విధంగా ఏసీబీ మరింత సమర్ధవంతం గా పని చేయించేందుకు..ఏసీబీ డీజీగా పీఎస్సార్ ఆంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇక, ఆయన ఏపీపీఎస్సీ కమిషనర్ గానూ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. ప్రస్తుతం రవాణా.. ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీరియస్ ఐఏయస్ అధికారి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

English summary
AP govt suddenly transfered ACB DG Kumar Viswajith and directed him to report in DGP office. PSR Anjaneyulu appointed as new ACB DG for AP. He also continue as APPSC commissioner as additioinal charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X