వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్: చంద్రబాబు హాయంలో కీలక అధికారి కేంద్రంగా: అధికారుల్లో కలకలం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో అలసత్వం వహించారనే కారణంతో ఇద్దరు అధికారులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలనాశాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేసారు. కొద్ది రోజుల క్రితం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్మదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు, జీఏడీలో పని చేస్తున్న అధికారులపైన ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ఈ ఇద్దరు అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకుందీ..అసలు ఏం జరిగిందేని ఇప్పుడు ఆసక్తి కర అంశంగా మారింది. ఈ వ్యవహారంలో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారి కేంద్రంగా జరగ్గా.. ఇందులో అధికారుల తీరుపైన సీరియస్ గా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టిట్ ఫర్ టాట్: నాడు చంద్రబాబు..నేడు జగన్: అదే మార్గంలో దెబ్బ తీయాలి..అందుకే ఇప్పుడు..!టిట్ ఫర్ టాట్: నాడు చంద్రబాబు..నేడు జగన్: అదే మార్గంలో దెబ్బ తీయాలి..అందుకే ఇప్పుడు..!

ఇద్దరు అధికారులు సస్పెన్షన్..

ఇద్దరు అధికారులు సస్పెన్షన్..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సాధారణ పరిపాలన శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారుల పైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ఇద్దరి అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. జీఏడిలో అసిస్టెంట్ కార్యదర్శిగా పని చేస్తున్న జయరామ్..అదే విధంగా అక్కడే సెక్షన్ అధికారిగా పని చేస్తున్న అచ్చెయ్యను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ కేంద్రం నుండి వచ్చిన ఒక ఫైల్ విషయంలోఉద్దేశ పూర్వకంగానే సమాచారం దాచిపెట్టారని...ప్రభుత్వంలోని పెద్దలకు నివేదించటంలో నిర్లక్ష్యం..ఒక ఐఆర్ యాస్ అధికారి రిలీవ్ అంశలో లేఖ రావటంతో వీరిద్దరి పైనా సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు హాయంలో అధికారి కేంద్రంగా

చంద్రబాబు హాయంలో అధికారి కేంద్రంగా

వీరిద్ది సస్పెన్షన్ కు కారణ మైన అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్య చౌదరి అనే ఐఆర్ యస్ అధికారి డిప్యుటేషన్ పైన కేంద్రం నుండి రిలీవ్ అయి ఏపీలో సీఎం పేషీలో కీలకంగా వ్యవహరించారు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఒక వివాదం కారణంగా ఆయన్ను ఏపీ ఎండీసీకి ఎండీగా నియమించారు. ఇక, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంకయ్య చౌదరిని ఆ పోస్టు నుండి తప్పించి జీఏడీకి రిలీవ్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేసారు. అప్పటి నుండి ఆయనకు పోస్టింగ్ లేదు. దీంతో..ఆయన తన మదర్ డిపార్ట్ మెంట్ లో తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి కేంద్ర హోం శాఖ పరిధిలో పని చేసే డీఓపీటీని అభ్యర్ధించారు. అయితే, ఇప్పుడు తొలి సారిగా ఆయన్ను డీమ్డ్ టు బి రిలీవ్ అంటూ ప్రస్తావించటం పైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు, జీఏడి ఏర్పాటైన నాటి నుండి ఈ విధంగా డీమ్డ్ టు బి రిలీవ్ అనేది లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

నిబంధలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారంటూ..

నిబంధలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారంటూ..

వెంకయ్య చౌదరి మీద పరిశ్రమల శాఖ ప్రస్తావించిన అభియోగాలతో పాటుగా విజిలెన్స్ రిమార్కులను ఫైల్ లో ప్రస్తావించకుండా ఉద్దేశ పూర్వంగా దాచి పెట్టారనేది వారి మీద ఉన్న అభియోగం. దీంతో..సీఎస్ ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. సీఎంఓ లోని ఒక కీలక అధికారి ఈ ఇద్దరు అధికారులను పిలిపించి..ఏం జరిగిందని ఆరా తీసారు. దీంతో..కేంద్రం నుండి లేఖ ..తాము స్పందించకపోవటానికి కారణాలను చెప్పుకొనే ప్రయత్నం చేసారు. వెంటనే సీఎంఓ అధికారి సీఎం జగన్ కు వివరించినట్లుగా సమాచారం. ఆ వెంటనే బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఆ ఇద్దరు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Recommended Video

Chandrababu Naidu Calls Jagan 'Despot' After State Govt Scraps Amaravati 'Start-up Area Project'
సచివాలయ వర్గాల్లో కలకలం..

సచివాలయ వర్గాల్లో కలకలం..

కేంద్రం నుండి రిలీవ్ చేయాలనే సమాచారం వచ్చినా..విజిలెన్స్ కేసు నడుస్తున్న సమయంలో ఆ విషయాన్ని నివేదించాల్సి ఉన్నా.. రిలీవ్ కోసం అడిగిన సమయంలో ఆ విషయాన్ని ప్రస్తావించాల్సి ఉన్నా..ఆ విధంగా చేయకపోవటమే ఈ సస్పెన్షన్ కు కారణమని సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదించకుండా.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య జరిగే కరెస్పాండెన్స్ లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు సచివాలయ అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనుమతి లేకుండా రాజధాని వదిలి వెళ్లవద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశం సైతం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

English summary
AP govt suspended two officers who working in GAD. On rules voilaion in A IRS officer deputation issue and negelgency in file matters govt taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X