వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఎక్సైజ్ పోలీసుల లీలలు- లాక్ డౌన్ ఉల్లంఘించి మద్యం సరఫరా- ప్రభుత్వం సీరియస్

|
Google Oneindia TeluguNews

కంచే చేను మేస్తే అన్న సామెత ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు ప్రస్తుతం వర్తిస్తుంది. కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఎక్సైజ్ సీఐ నిబందనలను ఉల్లంఘించి మరీ తన అధికారిక వాహనంలోనే మద్యాన్ని తీసుకెళుతూ దొరికిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి అతనిపై కఠిన చర్యలకు ఆదేశించ౧.

లాక్ డౌన్ అయితే నాకేంటి..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఎక్సైజ్ సీఐకీ ఇవేవీ పట్టలేదు. ఎక్సైజ్ సీఐని అయిన నన్నెవరు చేస్తారని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను ప్రయాణించే అధికారిక వాహనంలోనే మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నాడు. మధ్యలో అన్ని వాహనాలను చెక్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. సమధానం అడిగితే నీళ్లు నమిలాడు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లింది.

ap govt suspends excise ci for transport illegal liquor during lock down

Recommended Video

AP Lock down : Free Ration Started At Ration Shops | Rs 1000 To Poor on April 4th

ఎక్సైజ్ సీఐ తీరుపై ప్రభుత్వం సీరియస్..
లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉండగానే ఎక్సైజ్ సీఐ కంచే చేనుమేసిన తరహాలో తన వాహనంలోనే మద్యం బాటిళ్లు అక్రమంగా తరలించడంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికారిక వాహనంలో మద్యాన్ని తరలించినందుకు వెంటనే సస్పెన్షన్ విధించడమే కాకుండా 5 లక్షల రూపాయల జరిమానా కట్టాలని సీఐని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి దొంగలకు గుణపాఠంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణస్వామి ప్రకటించారు.

English summary
andhra pradesh govt suspended rayavaram excise circle inspector for violating lock down rules and transport liquor in his own vehicle. ap excise minister and deputy cm narayana swamy said govt imposed Rs.5 lakh fine on accused circle inspector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X