వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ పాత ప‌గ తీర్చుకుంటోందా..? ఆ పోలీసుల‌పై వేటు అందుకేనా ..?

|
Google Oneindia TeluguNews

నాడు విప‌క్ష నేత హోదాలో విశాఖ‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌త్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌స్తే అడ్గుకున్నారు. విమానాశ్ర‌మంలో ర‌న్‌వే వ‌ద్ద‌కే సాధార‌ణ పోలీసుల‌కు ప్ర‌వేశం లేక‌పోయినా..నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘించి జ‌గ‌న్ ను అడ్డుకునేందుకు నాడు అత్యుత్సాహం చూపించారు. ఫ‌లితంగా ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత నాటి ఆ అత్యుత్సాహ అధికారుల‌ను వీఆర్‌కు పంపుతూ పోలీసు ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేసారు. త‌మ ప్ర‌భుత్వంలో క‌క్ష్య సాధింపులు ఉండ‌వ‌ని చెబుతూనే ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం..గోప్యంగా ఉంచ‌టం పైన ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది.

నాడు జ‌గ‌న్‌ను అడ్డుకున్నారు..
2017 జ‌న‌వ‌రి 26న ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ‌లో వైసీపీ నిర‌స‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. అందులో పొల్గొనేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ హైదరాబాద్ నుండి విశాఖ చేరుకున్నారు. విమానాశ్ర‌మంలోనే స్థానిక పోలీసులు జ‌గ‌న్‌ను అడ్డుకున్నారు. గణతంత్ర వేడుకల రోజున బీచ్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పుకొచ్చారు. విమానాశ్ర‌యం భ‌ద్ర‌త కేంద్ర బ‌ల‌గాల ఆధీనంలో ఉంటుంది. టెర్మిన‌ల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత మాత్ర‌మే స్థానిక పోలీసుల ప‌రిధి మొద‌ల‌వుతుంది. అయితే, జ‌గ‌న్‌ను నాటి ప్ర‌భుత్వ‌.. పోలీసు ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు స్థానిక పోలీసులు విమానాశ్ర‌యం ర‌న్ వే వ‌ద్ద‌నే నిలుపుద‌ల చేసారు. దీనిని నిర‌సిస్తూ జ‌గ‌న్‌తో పాటుగా వ‌చ్చిన విజ‌య సాయిరెడ్డి, అంబ‌టి రాంబాబు అక్క‌డే ర‌న్‌వే మీద‌నే బైఠాయించారు. నిర‌స‌న వ్య‌క్తం చేసారు. ఇక ద‌శ‌లో పోలీసుల తీరు పైన జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు.

AP Govt taken action against who restricted Jagan in Vizag air port two and half years before.

ఆ అధికారులు ఇప్పుడు వీఆర్‌కు
నాటి ఘ‌ట‌న స‌మ‌యంలో విశాఖ పోలీసు క‌మిష‌న‌ర్‌గా యోగానంద్ ఉండేవారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావ డం.. జగన్‌ సీఎం కావడంతో.. అప్పట్లో ఆయన్ను విశాఖలో అడ్డుకున్న పోలీసు అధికారులందరినీ వీఆర్‌కు సరెండర్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీనిప్రకారం నగర పోలీస్‌ కమిష నరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సైని వీఆర్‌కు పంపుతూ జూలై 27న పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లు పోలీసు వర్గాల స‌మాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. అలాగే ఆ ఘటన జరిగినప్పుడు నగరంలో పనిచేసిన, తాజాగా విశాఖ రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న మరికొంతమంది అధికారులను కూడా వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే, త‌మ ప్ర‌భుత్వంలో కక్ష్య సాధింపు ఉండ‌ద‌ని వైసీపీ నేత‌లు ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. అయితే, నాటి పాల‌కులు..ఉన్న‌తాధికారుల ఆదేశాలు అమ‌లు చేసిన పోలీసు అధికా రుల పైన ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకోవ‌టం చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

English summary
AP Govt taken action against who restricted Jagan in Vizag air port two and half years before. On that police not permitted Jagan to participated in Special status rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X