వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమిపుత్ర శాతకర్ణిపై కేబినెట్ చర్చ: లేచి వెళ్లిపోయిన చంద్రబాబు..

తమ మధ్య ఉన్న బంధుత్వం ప్రభావం కేబినెట్ చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో జరిగిన ఈ భేటీలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' పన్ను మినహాయింపు అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే ఈ చర్చ సందర్బంగా సీఎం చంద్రబాబు సమావేశం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

'గౌతమిపుత్ర శాతకర్ణి' హీరో బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడం, పైగా బాలకృష్ణకు చంద్రబాబుకు బంధుత్వం ఉండటంతో.. ఆ ప్రభావం చర్చపై పడకూడదనే చంద్రబాబు సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

AP Govt taken imporatant decisions in the cabinet meeting

సెక్షన్-8 ప్రకారం సినిమాకు పన్ను రాయితీనిస్తూ కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.

కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు:

* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం
* పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్‌టీ కంపెనీకి రూ.95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు ఆమోద‌ముద్ర‌
* అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం
* ఏపీ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్ర‌ధాని మోదీని ఆహ్వానించాల‌ని నిర్ణయం.
*గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో వినోదపన్ను మినహాయింపు

English summary
AP govt cabinet in its meeting held here today in amaravathi. CM Chandrababu stepped out cabinet while taking decision of tax exception for gautami putra shatakarni
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X