వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ తొలగింపుకు రంగం సిద్ధం...? ఆర్డినెన్స్ సిద్ధం చేస్తున్న ఏపీ సర్కార్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ లాక్ కల్లోలం రేపుతున్న రాజకీయ వేడి పుట్టించే మరో నిర్ణయానికి వైసీపీ సర్కారు సిద్ధమవుతోందా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే కేబినెట్ భేటీయే దీనికి వేదిక కానుంది.

 నిమ్మగడ్డ తప్పించుకోలేరు.. క్రిమినల్ కేసులో అరెస్టు తప్పదు.. వైసీపీ ఉచ్చు.. సూసైడ్ స్క్వాడ్ అంటూ.. నిమ్మగడ్డ తప్పించుకోలేరు.. క్రిమినల్ కేసులో అరెస్టు తప్పదు.. వైసీపీ ఉచ్చు.. సూసైడ్ స్క్వాడ్ అంటూ..

ఎన్నికల కమిషనర్ కు చెక్... ?

ఎన్నికల కమిషనర్ కు చెక్... ?


ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కాకముందు స్ధానిక ఎన్నికల వాతావారణం వాడీ వేడిగా ఉంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటన వైసీపీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై పలు ప్రత్యామ్నాయాలను ఆలోచించింది. అంతలో కరోనా విజృంభణలో అన్ని ప్లాన్లను కాసేపు పక్కనబెట్టాల్సిన పరిస్దితి. కానీ రాష్ట్రంలో తాజాగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్డినెన్స్ సాయంతో తొలగింపు...

ఆర్డినెన్స్ సాయంతో తొలగింపు...

సాధారణంగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార ను పదవీచ్యుతుడిని చేయాలంటే అభిశంసన చేపట్టాల్సిందే. పార్లమెంటు ఉభయ సభల అంగీకారంతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే అభిశంసన జరిగి కమిషనర్ పదవి కోల్పోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఇదంతా జరుగుతుందా అంటే అనుమానమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ ను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఫల్యం చెందారనే కారణంతో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

వచ్చే కేబినెట్ లో ఆమోదం...

వచ్చే కేబినెట్ లో ఆమోదం...

రేపోమాపో సమావేశం కానున్న ఏపీ కేబినెట్ కరోనా వైరస్ తాజా పరిస్దితితో పాటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై తీసుకొచ్చే ఆర్ఢినెన్స్ పైనా చర్చించి ఆమోదించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ గా తన విధి నిర్వహణలో రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించి ఆర్డినెన్స్ ను ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 ఎన్నికల కమిషన్‌ లో మార్పులు..

ఎన్నికల కమిషన్‌ లో మార్పులు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై ఆర్డినెన్స్ కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ను సంస్కరించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా కమిషనర్ గా నియమించే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన వారు అయి ఉండటంతో పాటు మూడేళ్ల పదవీ కాలం మాత్రమే ఉండేలా నిబంధనలను సవరించాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

English summary
andhra pradesh govt is mulling over removing state election commissioner nimmagadda ramesh kumar soon. state cabinet would approve an ordinance for the removal of sec soon. as per the govt sources, chief secretary is preparting the ordinance file also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X