వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ వైద్యశాఖలో కొత్తగా 426 ఉద్యోగాల భర్తీ - నర్సింగ్ విద్యాసంస్ధల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం నాడు-నేడు పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జోరుగా సాగుతుండగా.. వీటిలో కొత్తగా ఉద్యోగాల కల్పనకూ తెరతీసింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా పనిచేస్తున్న నర్సింగ్ కళాశాలల్లో కొత్తగా 426 పోస్టులను సృష్టించనున్నారు. ఇందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని గుంటూరు జీజీహెచ్, శ్రీకాకుళం రిమ్స్, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కళాశాలల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే ఒంగోలు రిమ్స్, తిరుపతి ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న నర్సింగ్ స్కూళ్లలో మరో 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను త్వరలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది.

ap govt to fill 426 teaching and non-teaching posts in nursing schools and colleges

వీటిని రెగ్యులర్, ప్రమోషన్, ఔట్ సోర్సింగ్ విధానాల్లో భర్తీ చేసుకునేలా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏయే పోస్టులను ఎలా భర్తీ చేసుకోవచ్చో కూడా ఉత్తర్వుల్లో విడివిడిగా పేర్కొంది.
వీటి భర్తీ కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఔట్ సోర్సింగ్ పోస్టులను కార్పోరేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

English summary
andhra pradesh government issued orders to fill a total of 426 nursing posts in various hospitals, nusing colleges and schools also. in this 282 posts to be filled in nusing colleges and another 144 to be filled in nursing schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X