అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కొత్త తరహా డిగ్రీ కోర్సులు- పూర్తి చేస్తే జాబ్ గ్యారంటీ- జూన్ నుంచి అమల్లోకి...

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగం, ఉపాధి కల్పించని చదువులంటూ తిట్టుకునే రోజులు త్వరలో కనుమరుగు కానున్నాయి. చదువు పూర్తి చేసుకోగానే ఉద్యోగం కల్పించేలా ఆయా కోర్సులనే మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. పస్తుతం అన్నింటినీ ఒకేసారి మార్చకపోయినా ఒక్కొక్కటిగా మార్పులు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే తొలి విడతలో ఉద్యోగానికి హామీ ఇస్తూ ఓ కొత్త తరహా సిలబస్ తో మూడేళ్ల డిగ్రీ కోర్సులను ఉన్నతవిద్యామండలి ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశపెడుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఇసుక రగడ .. ఏపీ వాహనాలను సీజ్ చేసిన తెలంగాణా అధికారులుతెలుగు రాష్ట్రాల మధ్య ఇసుక రగడ .. ఏపీ వాహనాలను సీజ్ చేసిన తెలంగాణా అధికారులు

 జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ....

జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ....

ఇప్పటివరకూ జాబ్ గ్యారంటీ, జాబ్ ఓరియెంటెడ్ కోర్సు అనే పదాలు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల వద్ద విని ఉంటాం. కానీ తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగానికి హామీ నిచ్చే డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఉద్యోగానికి కావాల్సిన అన్ని పాఠ్యాంశాలతో పాటు అప్రెంటిస్ షిప్, ఉద్యోగ శిక్షణ కూడా ఇందులో భాగం కానుంది. విద్యార్ధుల నైపుణ్యాలను పెంచే దిశగా ప్రవేశపెడుతున్న ఈ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన సిలబస్ కూడా సిద్ధం చేశారు.

 స్కిల్ డెవలప్ మెంట్ తప్పనిసరి..

స్కిల్ డెవలప్ మెంట్ తప్పనిసరి..

బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ ఏదైనా ఇక అప్రెంటీస్ షిప్ తప్పనిసరి. అలాగే ఉద్యోగ శిక్షణ కూడా. అప్రెంటీస్ షిప్ లో నైపుణ్యాభివృద్ధి(skill development), జీవన నైపుణ్యాలు (life skills) సబ్జెక్టులు తప్పనిసరిగా ఉంటాయి.. ప్రతీ విద్యార్ధి వీటిలో ప్రతీ సెమిస్టర్ లో ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో సంవత్సరాల్లో రెండేసి నెలలను అప్రెంటీస్ షిప్ గా పిలుస్తారు. ఇందుకుగానూ సెలవుల్లో సమయం ఇస్తారు. చివరి ఏడాది ఆరునెలల శిక్షణను ఉద్యోగ నైపుణ్య శిక్షణగా (job sksills training) పిలవనున్నారు.

 స్కిల్ డెవలప్ మెంట్ సబ్జెక్టులు..

స్కిల్ డెవలప్ మెంట్ సబ్జెక్టులు..

బీఎస్సీలో అయితే వైద్య ప్రయోగశాల, సాంకేతికత, ఆక్వా, మత్స బయోలజీ ప్రయోగశాల, సాంకేతికత, పుడ్ అడల్ట్రేషన్ స్కిల్ డెవలప్ మెంట్ సబ్జెక్టులుగా ఉంటాయి. అలాగే బీకామ్ లో టూరిజం, రిటైల్ బిజినెస్, జీఎస్టీ, బిజినెస్ అనాలసిస్ సబ్జెక్టులుగా ఉంటాయి. బీఏలో అయితే డేటా ఎనలిటిక్స్, పబ్లిక్ స్పీచ్, బడ్జెట్ ప్రిపరేషన్, ఆఫీస్ ప్రాసెసింగ్, టూరిజం గైడెన్స్, సర్వే రిపోర్టింగ్, క్రియేటివ్ రైటింగ్, జర్నలిజం స్కిల్ డెవలప్ మెంట్ సబ్జెక్టులుగా ఉంటాయి. ప్రతీ విద్యార్ధి ప్రతీ సెమిస్టర్లో వీటిలో ఒక్కో సబ్జెక్టు ఎంపిక చేసుకోవాల్సిందే.

 జీవన నైపుణ్య సబ్జెక్టులు ఇవీ..

జీవన నైపుణ్య సబ్జెక్టులు ఇవీ..

జీవన నైపుణ్య సబ్జెక్టుల సిలబస్ ను కూడా ఉన్నతవిద్యామండలి ఖరారు చేసింది. ఇందులో గ్రూపులతో సంబంధం లేకుండా అందరికీ కామన్ గా మానవ విలువలు, వృత్తి నైతికత, కంప్యూటర్ అప్లికేషన్స్, స్టాటిస్టిక్స్, ఇండియన్ కల్చర్, సైన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్, ఎనలిటికల్ నైపుణ్యం, పర్సనాలిటీ ఎన్ హాన్సింగ్, లీడర్ షిప్, ఆరోగ్యం, పర్యావరణ విద్య వంటి సబ్జెక్టును అందుబాటులో ఉంచారు.

 స్కిల్ కార్పోరేషన్ ద్వారా శిక్షణ...

స్కిల్ కార్పోరేషన్ ద్వారా శిక్షణ...

విద్యార్ధి డిగ్రీ చివరి ఆరునెలల కాలంలో జాబ్ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను భాగస్వామిని చేస్తున్నారు. కార్పోరేషన్ ద్వారా విద్యార్ధులకు తగిన శిక్షణను ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికే డిగ్రీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అలా డిగ్రీ కోర్సును పూర్తి చేసిన వారికి ఉద్యోగాల కల్పనకు తగిన అవకాశాలను ప్రభుత్వం స్వయంగా కల్పించనుంది.

English summary
andhra pradesh higher education council will introduce new job oriented three year bachelor degree courses from june this year. already council had finalised the syllabus and it includes apprenticeship and job training also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X