వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- పూర్తి జీతాలు ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ తో ఆర్ధిక పరిస్ధితి దిగజారడంతో రెండు నెలలుగా జీతాల్లో కోత విధిస్తున్న సర్కారు.. మే నెలకు మాత్రం పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

 రంగనాయకమ్మపై జగన్ సర్కార్ సీరియస్- రేపు విచారణ, అరెస్టు నోటీసులు జారీ.. రంగనాయకమ్మపై జగన్ సర్కార్ సీరియస్- రేపు విచారణ, అరెస్టు నోటీసులు జారీ..

ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చేయాలని ఆర్ధిక శాఖకు, ట్రెజరీకి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ట్రెజరీ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నారు. రేపటి కల్లా సీఎంఎఫ్ఎస్ లో ఈ మార్పులు అందుబాటులోకి రానున్నాయి.

ap govt to pay full salaries to employees for may month

ఆ తర్వాత ఎప్పటి లాగే జూన్ 1న ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు. అయితే గత రెండు నెలలుగా జీతాలు, పింఛన్లలో కోత విధించిన సర్కారు.. వీటి బకాయిలు మాత్రం చెల్లించాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరోనా సంక్షోభం తర్వాత ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడగానే బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగులకు గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.

English summary
andhra pradesh govt has decided to give full salaries to their employees for the month of may. cm jagan has given orders for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X