వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఆ మూడు శాఖల ఉద్యోగులకు పూర్తి జీతాలు.. జగన్ నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

అమరావతి: కోవిడ్‌ -19 నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య-ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ -19 నివారణలో ఫ్రంట్‌లైన్లో పనిచేస్తున్న ఈ శాఖల సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వబోతున్నట్లు ఉన్నతస్ధాయి సమీక్షలో సీఎం అధికారులకు తెలిపారు. కరోనా వైరస్‌ నివారణకు వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని జగన్ పేర్కొన్నారు.

ఆ మూడు శాఖలకు పూర్తి జీతాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న మూడుశాఖల ఉధ్యోగులకు మాత్రం పూర్తిస్దాయిలో జీతాలు, వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం ఏపీలో కరోనా వైరస్ తాజా పరిస్దితిపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడంతో అధికారుల సూచన మేరకు జగన్ దీన్ని ఏపీలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు, సహాయక సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుశాఖ అధికారులు, సిబ్బందికి పూర్తి జీతాలు, వేతనాలు అందబోతున్నాయి.

ap govt to pay full salaries to medical, sanitation, police staff

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM

మిగతా ఉద్యోగులకు సగమే..
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలకు పరోక్షంగా సహకరిస్తున్న పలు విభాగాలు కూడా ఉన్నప్పటికీ వారికి కానీ. ఇతర శాఖలకు కానీ ఈసారి పూర్తి జీతాలు, వేతనాలు చెల్లించడం లేదు. వీరికి ప్రస్తుతానికి సగం జీతం, వేతనం, పింఛను అందిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని బట్ట మిగతా మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకూ ప్రకటించిన జీతాలను కూడా చెల్లించకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
ap govt has decided to pay full salaries to the staff who are working in coronavirus duties. as per the govt's decision all the medical, sanitation and police staff will get full salaries for the month of march. and all the remaining employees will get the salaries in two terms as already announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X