వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై పోరులో ఏపీ సర్కార్ మరో ముందడుగు- ఇంటి వద్దకే మొబైల్‌ శానిటైజర్లు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ల కొరత ప్రజలను వేధిస్తోంది. కానీ చూస్తూ చూస్తూ అలాగే వదిలేయలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మొబైల్ శానిటైజర్లను ప్రజల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.

 కరోనా భయాలతో శానిటైజర్ల కొరత..

కరోనా భయాలతో శానిటైజర్ల కొరత..

ఏపీలో కరోనా వైరస్ భయాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పుడే ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చేతులు శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లతో నిత్యం శుభ్రం చేసుకోవాలని పదేపదే సూచించింది. దీంతో కరోనాను ఎదుర్కోవాలంటే పరిశుభ్రంగా ఉండాలన్న భావనతో ప్రజలు వేలం వెర్రిగా శానిటైజర్లను కొనేందుకు ఎగబడ్డారు. దీంతో రోజుల వ్యవధిలోనే మార్కెట్లో శానిటైజర్లు మాయమయ్యాయి

శానిటైజర్ల పంపిణీకి చర్యలు..

శానిటైజర్ల పంపిణీకి చర్యలు..

ఏపీలో శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే తయారీ సంస్ధలతో మాట్లాడి వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. లక్షల సంఖ్యలో శానిటైజర్లు అతి తక్కువ సమయంలో ఉత్పత్తి చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. అందుబాటులో ఉన్న కాస్త స్టాక్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై చర్చలు జరిపింది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
ఇళ్ల వద్దకే మొబైల్ శానిటైజర్లు...

ఇళ్ల వద్దకే మొబైల్ శానిటైజర్లు...

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు అన్నీ కలిపినా రెండు, మూడు జిల్లాలకు కూడా సరిపోవు. దీంతో ప్రభుత్వం తామే శానిటైజర్లను భారీ పరిణామంలో సేకరించి వాటిని ప్లాస్టిక్ నీళ్ల ట్యాంకుల ద్వారా మొబైల్ శానిటైజర్ వాహనాలలో ప్రజల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ప్రజలు వీటిని వాడుకునేందుకు ఎగబడుతున్నారు.

English summary
Government of Andhra Pradesh brings equality to its people with access to better health n sanitation facilities as far as precautions of COVID-19 is concerned by arranging Mobile Hand Wash Facility in slums where people doesnt have access to hand sanitizer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X