వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రమంగా పాలనపై పట్టుసారిస్తున్నారు. ఇప్పటికే డీజీపీని మార్చిన జగన్ .. తాజాగా ఐఏఎస్‌ల బదిలీలు చేశారు. 8న మంత్రివర్గ విస్తరణ ఉండటంతో బెర్తులపై డిస్కస్ చేస్తూనే .. ఇటు పరిపాలన పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆశావర్కర్ల జీతాన్ని 7 వేలు పెంచిన సంగతి తెలసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సమర్థతతే గిటురాయి ..
తాజాగా కలెక్టర్ల బదిలీలు చేపట్టారు. జిల్లా పాలనలో కలెక్టర్ల కీ రోల్ పోషిస్తారు. ఈ క్రమంలో ఐఏఎస్‌ల బదిలీ చేపట్టారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా శామ్యూల్‌ ఆనంద్ కుమార్‌ను ట్రాన్స్ ఫర్ చేశారు. రాజధాని ప్రాంతం అమరావతి కూడా గుంటూరులోనే ఉండటం .. సమీక్షలు .. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండటంతో శామ్యూల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

ap govt transfer ias officers

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పీ భాస్కర్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ గా డీ మురళీధర రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఎంవీ శేషగిరి బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఎస్ సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా ముత్యాలరాజు, విశాఖ జిల్లా కలెక్టర్‌గా వినయ్ చంద్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా వీరపాండ్యన్, చిత్తూరు జిల్లా కలెక్టర్గా నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేశారు.

నెక్ట్స్ ఎస్పీలేనా ?
కలెక్టర్ల బదిలీ తర్వాత రాష్ట్రంలో ఐపీఎస్‌ల ట్రాన్స్ ఫర్ పై జగన్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అయితే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తారో .. లేదంటే ముందు చేపడుతారోననే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తమ ప్రాధాన్యాలైన నవరత్నాలపై జగన్ దృష్టిసారించే అవకాశం ఉంది.

English summary
AP CM YS Jagan Mohan Reddy is steadily holding the administration. Jagan, who has already changed DGP, has recently transferred the IAS officers. The key role of collectors in the district administration. Guntur district collector Samuel Anand Kumar was transferred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X