వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగుల మెరిట్‌ లిస్ట్‌: మిస్ అయితే మరో ఛాన్స్: ఇవి కావాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో ఉంచారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించారు. మెరిట్‌ లిస్ట్‌లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం ఉంది. వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్‌లెటర్లు తీసుకొని రావాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కలెక్టర్లు కూడా మెరిట్‌ లిస్ట్‌ను నోటిసు బోర్డులో అంటించాలని ఆదేశించారు. రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?

అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ

అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ

ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇవ్వాలని నిర్ణయంతీసుకున్నారు. ఇందుకోసం ఈ నెల 26వ తేదీ నుంచి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

వెరిఫికేషన్ కు వచ్చేముందు...

వెరిఫికేషన్ కు వచ్చేముందు...

వెరిఫికేషన్ కు వచ్చే అభ్యర్దులు అక్కడ అధికారులకు చూపించాల్సిన సర్టిఫికెట్ల పైన ప్రభుత్వం నిర్ధిష్ట సమాచారం విడుదల చేసింది. అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం తో పాటుగా ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం అదే విధంగా..ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు..నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. అదే విధంగా రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌...చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం తప్పని సరిగా తీసుకురావాలి.

తహసీల్దార్ జారీ చేసి సర్టిఫికెట్ లు..

తహసీల్దార్ జారీ చేసి సర్టిఫికెట్ లు..

బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తో పాటుగా బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌ తప్పని సరిగా తేవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా
దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాలి. ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, వీటితో పాటుగా .. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

English summary
AP Govt up loaded secetariat exams merit list in online and also kept in district collectorates. From this month 29th first phase training will start. second phase will be october 14th. CM strictly ordered that Village secretariats must start on october 2nd with out fail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X