వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పరిశ్రమ ఆధార్’: కంపెనీలకు నంబర్, ఏపీ సర్కార్ కీ డిషిసన్, కమిటీ నివేదికతో...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తామని తెలిపింది. పరిశ్రమ ఆధార్ పేరుతో స్పెషల్ నంబర్ కేటాయిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరుతో సర్వే చేస్తారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఉంటారు. సర్వేను అక్టోబర్ 15 లోపు పూర్తిచేయాలని జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. పరిశ్రమల్లో.. కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 9 అంశాలతో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనుంది.

ap govt will be give companies special number..

మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరిస్తారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది వివరాలు తీసుకుంటారు. అన్నీ అంశాలను క్రోడీకరించి.. కలెక్టర్/ పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు అందజేస్తారు. నిర్దేశిత సమయంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.

తర్వాత నివేదికను పరిశీలించి.. ప్రభుత్వం కంపెనీలకు 'పరిశ్రమ ఆధార్' నంబర్ కేటాయిస్తోంది. దీంతో రాష్ట్రంలో గల కంపెనీలు/రకాలు, వాటి పేర్లతో కూడిన పూర్తి జాబితా సమగ్రంగా ప్రభుత్వం వద్ద ఉంటుంది.

English summary
andhra pradesh government will be give companies special number ‘parisrama aadhar’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X