వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ సొమ్ముతో మాకు వద్దు: ఇంటి ఖర్చులపై సీఎం జగన్: మరో రెండు జీవోలు రద్దు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Govt Cancelled Antoher Two Go's : జగన్ భయపడ్డారా ? || Oneindia Telugu

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నివాసంతో పాటుగా క్యాంపు కార్యాలయాల్లో సదుపాయాల కోసం గతంలో నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ విధంగా మంజూరు చేసిన ఆరు జీవోలను రద్దు చేసిన ప్రభుత్వం..అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు మరె రెండు జీవోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా గతంలో రద్దు చేసిన నిధుల విలువ రూ 3.63 కోట్లు కాగా..ఇప్పుడు రద్దు చేసిన నిధులు మొత్తం రూ. 3.99 కోట్లు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ తన నివాసానికి ఖర్చు కోసం కేటాయించిన మొత్తం రూ. 6.86 కోట్లు పనులను రద్దు చేసారు. వీటిని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ నిధులు వద్దు..

ప్రభుత్వ నిధులు వద్దు..

ముఖ్యమంత్రి జగన్ తన నివాసం..క్యాంపు కార్యాలయాల్లో భద్రతకు మినహా..మరే ఖర్చులకు ప్రభుత్వ నిధులు వినియోగించకూడదని నిర్ణయించారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం సీఎం అధికారిక నివాసం.. క్యాంపు కార్యాలయంలో సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరు జీవోలను ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ నివాసంలో కిటికీలు..ఇతర సదుపాయాల కోసం దాదాపుగా రూ 16 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో పాటుగా జాతీయ మీడియాలోనూ చర్చ సాగింది. దీంతో..భద్రతా పరమైన అంశాలు మినహా ఇతర సదుపాయల విషయంలో ప్రభుత్వ నిధులు వద్దని సీఎం చెప్పినట్లు సమాచారం.

రూ. 6.86 కోట్ల నిధుల మంజూరు రద్దు

రూ. 6.86 కోట్ల నిధుల మంజూరు రద్దు

రెండు రోజుల క్రితం రద్దు చేసిన ఆరు జీవోల్లో మంజూరు చేసిన నిధుల విలువ రూ.2.87 కోట్లు. కాగా, తాజా మరో రెండు జీవోలు రద్దు చేస్తూ ఆర్‌అండ్‌బీ ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి నివాసంలో రూ.3,63,50,000తో ఎలక్ట్రికల్‌, ఎలకో్ట్రమెకానికల్‌ వర్క్‌లు చేపట్టాలని గత జూలై 12న జీవో 146 ఇచ్చారు. జారీ చేసిన నాలుగు నెలల తర్వాత వీటిని రద్దు చేసారు. జీవో 306 ప్రకారం లోట్‌సపాండ్‌ నివాసంలో రూ.35.50 లక్షల వ్యయంతో ఎలక్ట్రికల్‌, ఎలకో్ట్రమెకానికల్‌ వర్కులు చేపట్టాలని ప్రతిపాదించారు. రద్దయిన ఈ రెండు ఉత్తర్వుల్లో పేర్కొన్న పనుల విలువ రూ.3.99 కోట్లు. గత మూడు రోజుల కాలంలో రద్దయిన 8 జీవోల్లో పేర్కొన్న పనుల మొత్తం విలువ రూ.6.86 కోట్లు.

విమర్శలకు దూరంగా ఉండేందుకే..

విమర్శలకు దూరంగా ఉండేందుకే..

ముఖ్యమంత్రి నివాసానికి దాదపు రూ.16 కోట్లు ఖర్చు చేసారంటూ వచ్చిన వార్తలతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో..ముఖ్యమంత్రి ఆ నిధుల మంజూరు పైన సమీక్షించారు. ఆ నిధుల్లో ఎక్కువ శాతం ముఖ్యమంత్రి నివాసానికి వచ్చే రోడ్ల విస్తరణ..హెలిపాడ్ ఏర్పాటు.. సీఎం నివాసానికి..క్యాంపు కార్యాలయానికి భద్రతా పరంగా నిర్మాణాలు ఉన్నాయి. అదే విధంగా ఇంటికి కిటికీల కోసం పెద్ద ఎత్తున నిధులు ప్రస్తావించటం పైన విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో సైతం భద్రతా పరంగా సదుపాయాల కోసం నిధులు కేటాయించారు. వీటిలో తప్పని సరిగా ఖర్చు చేయాల్సిన నిధుల విషయంలో ఆమోదం తెలిపిన సీఎం జగన్..మిగిలిన మొత్తం రూ. 6.86 కోట్ల నిధుల మంజూరు కోసం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశించారు.

English summary
AP Govt cancelled antoher two go's which sanctioned funds for modification of CM official house and his camp office. Previously two go's cancelled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X