వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ వేసిన ఏపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ ముగుస్తున్న ఆధ్యయమని సీఎం కేసీఆర్ ప్రకటించగా మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరింత స్పీడును పెంచారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపోందించేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. ఇక వర్కింగ్ గ్రూప్‌లో ప్రజారవాణశాఖ, రవాణశాఖలోని ఏడుగురు అధికారులతో పాటు జీఏడీ అధికారులతో కమిటీని వేశారు. కాగా ఈ కమిటీ జీతాల చెల్లింపు విధివిధానాలు, పోస్టులు, ఉద్యోగులు పే స్కేలు తోపాటు ఇతర అంశాలపై కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కాగా ఈ నివేదికను వచ్చేనెల 15లోగా ఇవ్వాలని కోరింది.

 ap has appointed a committee for merger of RTC in the government

తెలంగాణలో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా స్పందించిన కాసేపటికే... ఏపీలో ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం మరింత స్పీడును పెంచింది. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామిమేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు కొద్ది రోజులక్రితమే విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తెలంగాణలో ఆర్టీసీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాత్రం వీలినం జరిగే అవకాశాలే లేవని ప్రకటించారు. మరోవైపు ఆయన ఏపీలో జరుగుతున్న విలీనంపై కూడ స్పందించారు. ఏపీలో ప్రకటన మాత్రమే చేశారని అన్నారు. అది అమల్లోకి వచ్చినప్పుడు పరీశీద్దామని అన్నారు. అయితే ఏపీ మాత్రం విలీనంపై పూర్తిగా దృష్టిసారించారు.

English summary
ap government has appointed a committee for pursue of merger of RTC in the government, which is announced by AP CM Jagan Mohan Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X