వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న : ఏపి కి అర్హ‌త లేదు ..!

|
Google Oneindia TeluguNews

ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి పై ఏపి ప్ర‌భుత్వం అసంతృప్తి వ్య‌క్తం చేస్తుంది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అద‌నంగా రుణం పొంద‌టానికి ఏపికి అర్హ‌త లేద‌ని తేల్చేసింది. రాజ్య‌స‌భ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ ప్ర‌క‌ట‌న చేసారు.

ఆద‌నంగా రుణాలు పొంద‌లేరు..
కేంద్రం మ‌రో కీల‌క విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. 14వ ఆర్థికసంఘం నిర్దేశితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో షరతులను పూర్తి చేయలేదని, అందువల్ల అదనపు రుణాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి అర్హత లేదని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ ఈ విషయం వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం ఏపీ, తెలంగాణ రెండింటికీ జీఎస్డీపీలో మూడు శాతం మేరకు ఆర్థికలోటుకు పరిమితి విధించిందని పేర్కొన్నారు.

అయితే, రుణ జీఎస్డీపీ నిష్పత్తి 25 శాతం దాటకుండా, వడ్డీ చెల్లింపులు-ఆదాయ వసూళ్ల నిష్పత్తి 10 శాతం మించకుండా ఉంటే ఈ ఆర్థికలోటు పరిమితిలో కూడా సడలించవచ్చని ఆర్థికసంఘం సిఫార సు చేసిందని తెలిపారు. ఈ ప్రాతిపదిక ప్రకారం తెలంగాణకు మాత్రమే రూ.2052 కోట్ల మేరకు అదనపు రుణాలు చేసేందు కు అర్హత లభించిందని స్పష్టం చేశారు. ఏపి ప్ర‌భుత్వం తాజాగా బ‌డ్జెట్ ప్ర‌తిపాదిస్తున్న స‌మ‌యంలోనే ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్ద‌మౌతున్న బీజేపి జాతీయ నేత‌లు..!!ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్ద‌మౌతున్న బీజేపి జాతీయ నేత‌లు..!!

AP have no chance : Central key announcement

ష‌ర‌తులు పూర్తి చేయ‌లేదు..
ఇదే స‌మ‌యంలో కేంద్రం త‌న ప్ర‌క‌ట‌న‌లో ఏపికి సూచించిన ష‌ర‌తులు పూర్తి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. 2018-19లో జీఎస్డీపీలో 0.25 శాతానికి సమానంగా ఈ మొత్తం ఉంటుందని, అది మూడు శాతం సాధారణ పరిమితికి అదనంగా లభిస్తుందని ఆయన చెప్పారు. కాగా, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, కానీ షరతులు పూర్తిచేయనందున రాష్ట్రానికి అర్హత లేదన్నారు. అలాగే, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీని చెల్లించేందుకు రూ.15.81 కోట్లు విడుదల చేశామని కేంద్ర మంత్రి సమా ధానంగా చెప్పా రు.

కాగా, వెనుకబడిన జిల్లాల నిధులపై గల్లా జయదేవ్‌ ప్రశ్నించగా.. రూ.350 కోట్లు విడుదల చేసి, ప్రక్రియలో లోపాల వల్ల తిరిగి వెనక్కి తీసుకున్నామని హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ లోక్‌సభలో తెలిపారు. నిధులు వెన‌క్కు తీసుకోవ‌టం పై కొంత కాలంగా ఏపి ప్ర‌భుత్వం కేంద్రం పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తోంది.

English summary
Central Govt clarified that AP Govt have no chance for additional borrowings. Central Minister Pon Radhakrishnan says that ap govt not fulfilled the conditions which apply for additional borrowings as per 14th Finance commission framed the rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X