• search
 • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వకీల్ సాబ్‌కు షాక్... టికెట్ ధరల పెంపు కుదరదన్న హైకోర్టు... జగన్ సర్కార్‌దే పైచేయి...

|

సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో వకీల్ సాబ్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ ధరలను పెంచవద్దని ఆదేశించింది. దీంతో వకీల్ సాబ్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ టికెట్ ధరల పెంపుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా... ప్రభుత్వం దాన్ని డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. శనివారం(ఏప్రిల్ 10) దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. టికెట్ ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఆదివారం వరకు ఇప్పటికే బుక్ అయిన టికెట్లకు ఇది వర్తించదని వెల్లడించింది.

జనసేన అధినేత,సినీ హీరో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా శుక్రవారం(ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు సరిగ్గా వారం రోజుల ముందు విడుదలైన ఈ సినిమా ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. సినిమా బెనిఫిట్ షోలకు,టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. పవన్ కల్యాణ్‌కు భయపడి సీఎం జగన్ బెనిఫిట్ షోలను రద్దు చేశారని బీజేపీ,జనసేన నేతలు విమర్శించారు.

ap hc shock to vakeel saab and says ticket prices should be as per govt directives

ఇదే క్రమంలో టికెట్ ధరలు పెంచవద్దంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు,థియేటర్ యజమానులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్... మూడు రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్‌తో డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్... సినిమా టికెట్ ధరలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఉంటాయని స్పష్టం చేసింది.టికెట్ ధరల పెంపు కేవలం శనివారానికే వర్తింపజేయాలని ఆదేశించింది. దీంతో వకీల్ సాబ్‌కు కోర్టులో చుక్కెదురైనట్లయింది.

  Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !

  ఇక సినిమా విషయానికి వస్తే... మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్,ప్రకాష్ రాజ్ మధ్య కోర్టు సీన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. అలాగే థమన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో వకీల్ సాబ్ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఎదురుచూసిన నిర్మాత దిల్ రాజు... ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరడం,సినిమా పెద్ద హిట్ కావడంతో సంతోషంలో మునిగిపోయారు. సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

  English summary
  The AP High Court has issued key orders in the ongoing dispute between the AP government and Vakeel Saab movie distributors over the hike of movie ticket prices. Court Ordered not to increase movie ticket prices.and said that ticket prices will be as per government directives.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X