వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఎఫెక్ట్ : ఉద్దానంలో మంత్రులు, కమిటీ పర్యటన, వ్యాధికి కారణమేమిటి?

ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారడానికి కారణాలు ఏమిటనే విషయమై ఆరా తీసే పనిలో పడింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రతి ఇంటింటిక సర్వే నిర్వహించనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం :ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారడానికి కారణాలు ఏమిటనే విషయమై ఆరాతీసే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రతి ఇంటింటికి సర్వే నిర్వహించనుంది.ఈ నెల 19వ, తేదిన మంత్రులు,కమిటీ సభ్యులు ఉద్దానంలో పర్యటించనున్నారు.

బాబు నుంచి కేంద్రం దాకా వెళ్లిన పవన్ కళ్యాణ్ 'ఫైట్': ఉద్ధానంలో ఎందుకిలా?బాబు నుంచి కేంద్రం దాకా వెళ్లిన పవన్ కళ్యాణ్ 'ఫైట్': ఉద్ధానంలో ఎందుకిలా?

ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఇటీవల సినిమా నటుడు పవన్ కళ్యాణ్ సభ నిర్వహించాడు. ఉద్దానం కిడ్నీ బాదితులతో చర్చించాడు. ఈ సమస్య రావడానికి గల కారణాలు తెలుసుకోనేందుకు పవన్ కళ్యాణ్ కమిటిని ఏర్పాటు చేశాడు.

ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉద్దానం లో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.

కిడ్నీ వ్యాదిగ్రస్తుల సమస్యలపై పవన్ కళ్యాణ్ పర్యటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఈ మేరకు కిడ్నీ బాదితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలను చేపట్టింది.

ఇంటింటి సర్వేకు సర్కార్ చర్యలు

ఇంటింటి సర్వేకు సర్కార్ చర్యలు

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తోందో అనే విషయాలను పరిశిలించేందుకుగాను సర్కార్ నడుంబిగించింది. ఈ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 19వ, తేదిన ఉద్దానంలో మంత్రులు, ఇతర కమిటీ సభ్యులు పర్యటించనున్నారు. ఉద్దానంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం అధ్యయనం చేయనుంది.

ఆరోగ్య మంత్రి కామినేని పర్యటన

ఆరోగ్య మంత్రి కామినేని పర్యటన

ఉద్దానం ప్రాంతంలో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసేందుకుగాను ఎపి ఆరోగ్యశాక మంత్రి కామినేని శ్రీనివాసరావు స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ నెల 19వ తేదిన మంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు.ఇంటింటి సర్వే ద్వారా ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను తెలుసుకొనే అవకాశం ఉంది.

నివేదికను కేంద్రానికి సమర్పించనున్న కామినేని

నివేదికను కేంద్రానికి సమర్పించనున్న కామినేని

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను అధ్యయనం చేస్తోంది ప్రభుత్వం. ఈ నివేదిక రాగానే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాతో ఎపి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సమావేశం కానున్నారు. కేంద్ర బృందం కూడ ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశాలున్నాయి.ఉద్దానంలో బాదితులకు సౌకర్యాలు కల్పించేందుకుగాను కేంద్రం సహకారం కూడ తీసుకొనే అవకాశం ఉంది.

కిడ్నీ వ్యాధి ప్రబలకుండా చర్యలు

కిడ్నీ వ్యాధి ప్రబలకుండా చర్యలు

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఎందుకు వ్యాపిస్తోందో కారణాలు తెలసుకొంటే వ్యాధిని నివారించే అవకాశం ఉంది.అయితే ఇప్పటివరకు ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలను మాత్రం కనుక్కోలేకపోయారు.అయితే శాస్త్రీయంగా ఈ విషయాన్ని కనుక్కోనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా కిడ్నీ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకొనేందుకు సర్కార్ చర్యలను తీసుకోవాలని భావిస్తోంది.

పవన్ ఎఫెక్ట్ తో సర్కార్ ఉరుకులు పరుగులు

పవన్ ఎఫెక్ట్ తో సర్కార్ ఉరుకులు పరుగులు

ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై సిని నటుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశం తో ప్రభుత్వంపై తీవ్రంగా కన్పించింది. పవన్ సమావేశం తర్వాత ఉద్దానంలో ఏం జరుగుతోందనే విషయాలను ఆరా తీస్తోంది. పాలకులు మారిన ఈ సమస్య నుండి ప్రజలు మాత్రం బయటపడలేదు. ఈ విషయాలను పవన్ కళ్యాణ్ విమర్శించాడు. మరో వైపు ఈ సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చాడు. దీంతో ప్రభుత్వం కూడ వేగంగా స్పందిస్తోంది.

English summary
ap health minister and committe members will visit in uddanam on january 19. why people suffering from kidney diseas governament take a survey,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X