వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ రంగుల తొలగింపుకు హైకోర్టు గడువు .. ఎప్పటిలోగా అంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయితీలకు వైసీపీ రంగులు వేయటంపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై కొనసాగిన విచారణలో కార్యాలయాలకు రంగుల తొలగించాలని , ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అయితే పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు తొలగించేందుకు 3నెలలు గడువు కావాలని కోరిన సర్కార్ ను హైకోర్టు మందలించింది .ఇక తాజాగా నేడు మూడు వారాల గడువుకు అంగీకరించింది హైకోర్టు ధర్మాసనం . ఎన్నికల నిర్వహణ లోపే రంగులు తొలగించాలని ఆదేశించింది .

ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా : వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆవేదనఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా : వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆవేదన

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల తొలగింపు ఇంకా పూర్తి కాలేదు . ఇక ఈ వ్యవహారంలో కోర్టుకు గడువు కావాలని కోరిన ఏపీ సర్కార్ ను కోర్టు చీవాట్లు పెట్టింది. మీ వ్యవహారం చూస్తే స్థానిక ఎన్నికలు ముగిసే దాకా ఆ రంగులు తొలగించకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లుంది. మూడు నెలలు గడువిస్తాం, అప్పటి వరకూ స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా? గత వాదనలో ప్రశ్నించిన హైకోర్టు రంగుల తొలగింపునకు అంత గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.అయితే లాక్‌డౌన్‌ ముగిశాక ఆ రంగుల్ని తొలగించి, కొత్తవి వేసేందుకు ఎంత సమయం పడుతుందో అధికారుల వద్ద తెలుసుకుని వివరాలు అందిస్తామని, అందుకు కొంతసమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం నేడు మరోమారు ఈ వ్యవహారంలో విచారణను కొనసాగించింది .

AP High Court deadline for removal of YCP colors

Recommended Video

Coronavirus : Corona Positive Patient Discharged In AP Guntur District

సచివాలయాలకు రంగుల మార్పుపై విచారణ జరిపిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయితీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని ఏపీ సర్కార్ ను ఆదేశించింది. పంచాయితీ కార్యాలయాలకు వేసిన వైసీపీ పార్టీ రంగులను తొలగించటానికి మొదట మూడు నెలల గడువు కోరిన సర్కార్ ఇప్పుడు తాజాగా మూడు వారాల గడువు కావాలని హైకోర్టు ను కోరింది . దీంతో మూడు వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు రంగులను తొలగించాల్సిందేనని ఆదేశించింది .

English summary
In the ongoing hearing of the petition filed by the High Court on the YCP colours on Panchayats, the High Court has suggested that the goverment need to remove and the State Election Commission should take responsibility for this. However, the High Court has dismissed government request for a three-month deadline to remove the YCP colors for the panchayat buildings. Now high court gave permission for three weeks . It says the colors should be removed within the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X