వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురు : ఈసి ఆదేశాలు అమ‌లు చేయాల్సిందే : ఏబి బ‌దిలీ త‌ప్ప‌దు.!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఎన్నిక‌ల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవ‌టానికి విముఖ‌త వ్య‌క్తం చేసింది. దీంతో..ఏపి ఇంట‌లిజెన్స్ డిసి ఏబి వెంక‌టేశ్వర రావు బ‌దిలీని నిలుపుద‌ల చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు బ‌దిలీ చేయ‌క త‌ప్ప‌ని ప‌రి స్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం దీని పై అప్పీల్ కు వెళ్తుందా లేదా అనేది చూడాలి..

హైకోర్టు కీల‌క తీర్పు...

హైకోర్టు కీల‌క తీర్పు...

ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చేసిన అధికారుల వ్య‌వ‌హారం పై ఏపి ప్ర‌భుత్వం హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేసింది. దీని పై ఏపి ప్ర‌భుత్వం..ఎన్నిక‌ల సంఘం న్యాయ‌వాదుల‌తో పాటుగా వైసిపి న్యాయ‌వాది సైతం ఇంప్లీడ్ అయ్యారు. సు దీర్ఘ వాద‌న‌ల త‌రువాత హైకోర్టు తీర్పు ను రిజ‌ర్వ్ చేసింది. కొద్ది సేప‌టి క్రితం దీనికి సంబంధించిన తీర్పును హైకోర్టు వెల్ల‌డించింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు అమ‌లు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల సంఘం ఆదేశాల పై చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను తోసిపుచ్చింది. ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటీష‌న్ ను కొట్టివేసింది. దీంతో.. ఇంట‌లిజెన్స్ డిజిని బ‌దిలీ చేయ‌కుండా నిలుపుద‌ల చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు ఏబి వెంక‌టేశ్వ‌ర రావు ను ఇప్పుడు బ‌దిలీ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే, ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం దీని పై సుప్రీంకు అప్పీల్ కు వెళ్తుందా లేక కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేస్తుందా అనేది చూడాల్సిందే.

 ఇంట‌లిజెన్స్ డిజి కోస‌మే..

ఇంట‌లిజెన్స్ డిజి కోస‌మే..

ఎన్నిక‌ల సంఘం ఏపిలో ఇంట‌లిజెన్స్ డిజి తో పాటుగా శ్రీకాకులం, క‌డ‌ప ఎస్పీల‌ను బ‌దిలీ చేసింది. అయితే, వైసిపి ఫిర్యాదు మేర‌కు పోలీసు అధికారుల‌ను ఎలా బ‌దిలీ చేస్తార‌ని టిడిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎటువంటి విచార‌ణ లేకుండా ఎలా వారి పై వేటు వేస్తార‌ని నిల‌దీస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అస‌లు ఎన్నిక‌ల విధుల్లోకి ఇంట‌లిజెన్స్ విభాగం రాద‌ని..ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలో లేని ఇంట‌లిజెన్స్ డిజిని ఎలా బ‌దిలీ చేస్తార‌ని ఏపి ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తోంది. దీని పై ఎన్నిక‌ల సంఘానికి ముఖ్య‌మంత్రి లేఖ రాయ‌టంతో పాటుగా హైకోర్టు లో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టులో సైతం ఇంటలిజెన్స్ విభాగం ఎన్నిక‌ల విధుల ప‌రిధిలోకి రార‌ని వాదించారు. దీని పై ఎన్నిక‌ల సంఘం..వైసిపి త‌ర‌పు న్యాయ‌వాదులు విభేదించారు. పోలీసు వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన ఇంట‌లిజెన్స్ పోలీసులు సైతం ఎన్నిక‌ల విధుల్లోకి వస్తార‌ని వారు కోర్టుకు నివేదించారు.

ఇప్ప‌టికైనా బదిలీ చేస్తారా...

ఇప్ప‌టికైనా బదిలీ చేస్తారా...

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు తొలుత ఏపి ప్ర‌భుత్వం ఇంట‌లిజెన్స్ డిజి తో పాటుగా శ్రీకాకుళం..క‌డ‌ప ఎస్పీల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. అయితే, ఆ త‌రువాత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పునీత ఆ ముగ్గురి బ‌దిలీ జీవోను ర‌ద్దు చే స్తూ..ఆ త‌రువాత మ‌రో జీవో జారీ చేసారు. అందులో ఇద్దరు ఎస్పీల‌ను బ‌దిలీ చేస్తూనే..ఇంట‌లిజెన్స్ డిజిని మాత్రం బ దిలీ చేయ‌కుండా నిలుపుద‌ల చేసారు. ఇప్పుడు హైకోర్టు సైతం ఏపి ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటీష‌న్ కొట్టివేయ‌టం తో పాటుగా..ఎన్నిక‌ల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌టం ద్వారా..ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నే ది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
AP High court declines to interfere with the orders of Election commission in IPS officers Transfers issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X