వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ దూకుడుకు బ్రేక్‌: పీపీఏల‌ స‌మీక్ష నిర్ణ‌యంపై హైకోర్టు స్టే: 40 కంపెనీల‌కు ఊర‌ట‌..!

|
Google Oneindia TeluguNews

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన దూకుడుతో ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు హైకోర్టు బ్రేకులు వేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో అధిక ధ‌ర‌ల‌కు పీపీఏలు చేసుకున్నారంటూ కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష చేయాల‌ని నిర్ణ యం తీసుకున్నారు. దీని మీద అన్ని కంపెనీల‌కు సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్ లేఖ రాసింది. ఆ లేఖ‌తో పాటుగా ప్ర‌భుత్వం స‌మీక్షకు నిర్ణ‌యిస్తూ ఇచ్చిన జీవోను సైతం తాత్కాలికంగా స‌స్పెండ్ చేసింది. దీంతో.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చేస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

Recommended Video

సంప్రదింపుల కమిటీ రద్దుచేయాలి - హైకోర్టు లో 15 వాజ్యాలు

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌..
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన వేగంగా అడుగులు వేస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. పీపీఏ లను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) సమీక్షించాలని ప్రభుత్వం జారీ చేసిన.. జీవో నెం. 63ను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. పీపీఏలపై సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్‌ రాసిన లేఖను కూడా సస్పెండ్ చేసింది.

AP High court given stay order on govt decision to Review on PPAs. 40 Power companies approached high court against

తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. పీపీఏల సమీక్షకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై.. 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున సుప్రీం కోర్టు న్యాయ మూర్తి ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. గ‌తంలోనే దీని పైన కేంద్ర ఇంధ‌న శాఖ స‌మీక్ష‌ల విష‌యంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కానీ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో ముందే వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీంతో..విద్యుత్ సంస్థ‌లు హైకోర్టును ఆశ్ర‌యించాయి.

22వ తేదీ వ‌రకు స్టే విధించిన హైకోర్టు..
పీపీఏలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 63ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు విద్యుత్‌ సంస్థలకు ఏపీఎస్‌పీ డీసీఎల్‌ రాసిన లేఖలనూ నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. యూనిట్‌ ఛార్జీలు తగ్గించి బకాయి బిల్లు వివరాలు అందించాలని విద్యుత్‌ సంస్థలను ఏపీఎస్‌పీడీసీఎల్‌ కోరింది. టారిఫ్‌ ధరలు నచ్చకపోతే సంప్రదింపుల కమిటీ వద్ద తమ వైఖరి చెప్పాలని.. లేకపోతే పీపీఏలు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు విద్యుత్‌ సంస్థలు ఆరోపించాయి. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించింది.

English summary
AP High court given stay order on govt decision to Review on PPA's. 40 Power companies approached high court against govt decision. High court suspended Govt Go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X