కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు: రద్దు చేయమంటూ: మరో ఎమ్మెల్యేకు సైతం..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీని పైన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. సుపీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు.. పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్న వివరాలను ఆదాయంలో చూపాలని..అయితే అందుకు విరుద్దంగా చంద్రబాబు వ్యవహరించారంటూ ఆయన మీద వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన చంద్రమౌళి కేసు దాఖలు చేసారు.

ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు మీద ఇదే రకమైన కేసులు కొనసాగుతుండగా..తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సైతం హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారనేది ఆయన పైన పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంటకరావు పిటీషన్ లో పేర్కొన్న ఫిర్యాదు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీలో చర్చకు కారణమైంది.

చంద్రబాబుకు నోటీసులు ఎందుకంటే..

చంద్రబాబుకు నోటీసులు ఎందుకంటే..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ఆరోసారి కుప్పం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..ఆయన ఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. చంద్రబాబు మీద వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిన కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్‌ ఎన్నికల పిటీషన్ దాఖలు చేసారు.

చంద్రబాబుతో పాటుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కూడా

చంద్రబాబుతో పాటుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కూడా

దీని పైన హైకోర్టు చంద్రబాబుతో పాటుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కూడా నోటీసులిచ్చింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రారు నోటీసులు జారీ చేశారు. అందులో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘించారు.. ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలనే అంశం పైన పిటీషనర్ అనేక అంశాలను ప్రస్తావించారు. కుప్పం లో చంద్రబాబు గతం కంటే చాలా తక్కవ మెజార్టీతో ఈ సారి గెలుపొందారు.

ఎన్నిను రద్దు చేయాలని కోరుతూ..

ఎన్నిను రద్దు చేయాలని కోరుతూ..

ఇదే పిటీషన్ లో చంద్రమౌళి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తావించారు. సుపీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు.. పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్న వివరాలను ఆదాయంలో చూపాలన్నారు. వృత్తి రీత్యా వచ్చే ఆదాయాన్ని వివరాల్లో చూపాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి తన ఆదాయంతోపాటు కుటుంబసభ్యుల ఆదాయాన్ని కూడా అఫిడవిట్లలో పేర్కొనాలన్న నిబంధనను చంద్రబాబు ఉల్లంఘించారని కోర్టుకు నివేదించారు. వృత్తి రీత్యా వచ్చే ఆదాయాన్ని వివరాల్లో చూపాలన్నారు.

ఆదాయాన్ని కూడా అఫిడవిట్లలో

ఆదాయాన్ని కూడా అఫిడవిట్లలో

ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి తన ఆదాయంతోపాటు కుటుంబసభ్యుల ఆదాయాన్ని కూడా అఫిడవిట్లలో పేర్కొనాలన్న నిబంధనను చంద్రబాబు ఉల్లంఘించారని చెప్పారు. సిఎంగా తీసుకున్న జీతభత్యాలను సామాజిక సేవ ద్వారా వచ్చిన రాబడిగా పేర్కొని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరారు. విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

టీడీపీ ఎమ్మెల్యే వంశీ విషయంలో ఇలా..

టీడీపీ ఎమ్మెల్యే వంశీ విషయంలో ఇలా..

గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ఎన్నిక చెల్లదన్న కేసులో హైకోర్టు ఆయనతోపాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నోటీసులిచ్చింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు ఎలక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఎన్నికలప్పుడు వంశీ ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఓటర్లను ప్రలోభపెట్టారని, తహసీల్దార్‌ సంతకాల్ని ఫోర్జరీ చేసి ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారని యార్లగడ్డ వెంకటరావు తరపు లాయర్‌ వాదించారు. వంశీ చేతిలో పిటిషనర్‌ యడ్లపాటి 990 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల సమయంలోనూ వీరిద్దరి మధ్య వివాదాలు సాగాయి. ఇక, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత గెలిచిన టీడీపీ అభ్యర్ధుల మీద పోటీ చేసి ఓడిన వైసీపీ అభ్యర్దులు పలువురు కోర్టుల్లో ఇవే రకమైన పిటీషన్లను దాఖలు చేసారు. ఒక్కొక్కరుగా కోర్టు నోటీసులను అందుకుంటున్నారు.

English summary
AP High court issued notices to Tdp Chief chandra babu on voilation of supreme court guide lines in elections. Kuppam YCp candidate Chandramouli filed petition against Chandra babu in High cout. At the same TDP antoher Mla Vallabhaneni Vamsi also got court notices on same issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X