వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ టీడీపీ నేతలకు అప్పుడే బ్యాడ్ టైం మొదలైందా ? ఏడాది కింద కేసులు నోొటీసులు !

|
Google Oneindia TeluguNews

సీనియ‌ర్ ఐపియ‌స్ అధికారిని దూషించిన కేసులో టిడిపి నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ర‌వాణా క‌మిష‌న‌ర్ గా ఉన్న బాల‌సుబ్ర‌మ‌ణ్యం పై టిడిపి నేత‌లు బెదిరించిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ ద్వారా వీటిని అంద‌చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఐపియ‌స్ పై దూష‌ణ‌ల ప‌ర్వం..
ఏడాది క్రితం కృష్ణా జిల్లాకు చెందిన టిడిపి నేత‌లు ఐపియ‌స్ అధికారి..ర‌వాణా క‌మిష‌న‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం పై దూష‌ణ‌లకు దిగ‌టం.. బెదిరింపుల‌కు దిగటం పై హైకోర్టు సుమోటోగా కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో టిడిపి నేత‌లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మ‌న్ నాగుల్ మీరాకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌ను విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ ద్వారా అంద‌చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.

AP High Court issued notices to TDP leaders in IPS Bala Subramanyam case

ప‌త్రిక‌లో అధికారి పై దౌర్జ‌న్యం అనే వార్త ఆధారంగా హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీక‌రించింది. దీనిని అప్ప‌టి న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శివ‌శంక‌రరావు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో..ఈ కేసులో ఇప్ప‌టికే ప్ర‌తివాదుల‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఎంపి నాని త‌న‌కు నోటీసులు అంద‌లేన‌ది న్యాయ‌వాది ద్వారా కోర్టుకు నివేదించారు. దీంతో..మ‌రోసారి నోటీసులు జారీ అయ్యాయి.

ప‌ర్మిట్ల వ్య‌వ‌హారం పై నిల‌దీత‌..
ఏపిలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన ప్ర‌యివేటు ట్రావెల్స్ ప‌ర్మిట్ల విష‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. వారిని నియంత్రించ‌టంలో ఏపి ర‌వాణా శాఖ విఫ‌ల‌మైందంటూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని నాని ఆందోళ‌న‌కు దిగారు. ఆయ‌న త‌న కేశినేని ట్రావెల్స్ మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుండి అక్ర‌మ ప‌ర్మిట్ల‌తో ఏపిలో య‌దేచ్ఛ‌గా తిరుగుతున్న బ‌స్సుల‌ను ఎందుకు నియంత్రించ‌టం లేదంటూ ర‌వాణా క‌మిష‌న‌ర్‌గా ఉన్న బాల‌సుబ్ర‌మణ్యం కార్యాల‌యం వ‌ద్ద‌కు టిడిపి నేత‌లు వెళ్లారు.

ఆయ‌న పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. అప్ప‌ట్లోనే దీని పై సివిల్ స‌ర్వీసు అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. నిర‌స‌న తెలిపారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసాయి. దీంతో..ముఖ్య‌మంత్రి టిడిపి నేత‌ల‌ను పిలిపించి మంద‌లించారు. ఐపియ‌స్ అధికారి బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు వారితో క్ష‌మాప‌ణ చెప్పించారు. దీంతో, అప్ప‌ట్లో వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేయ‌టంతో మ‌రో సారి ఈ అంశం తెర మీద‌కు వ‌చ్చింది.

English summary
AP High court issued notices to TDP leaders who misbehaved with senior IPS Officer and AP Transport commissioner Bala Subramanyam. Hi court taken this issue as sumoto and ordered Viajaywada Police commissioner to give notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X