ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితం -ఓట్ల లెక్కింపునకు హైకోర్టు ఓకే -ఇక నీలం సాహ్నిదే ఆలస్యం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసి రెండు నెలల తర్వాతగానీ ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై ఉత్కంఠ వీడలేదు. వివాదాల కారణంగా ఫలితాల వెల్లడిని వాయిదా వేసిన హైకోర్టు ఎట్టకేలకు ఓట్ల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతించింది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సిద్ధమయ్యారు. కోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఎస్ఈసీ స్పష్టత ఇస్తారు.

షాకింగ్: కొవిడ్‌ రోగులకు black fungus -మరో మహహ్మారి విజృంభణ -పెరిగిన మ్యూకర్‌మైకోసిస్‌ కేసులుషాకింగ్: కొవిడ్‌ రోగులకు black fungus -మరో మహహ్మారి విజృంభణ -పెరిగిన మ్యూకర్‌మైకోసిస్‌ కేసులు

AP High Court nod to Eluru municipal Corporation election result

ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు, గందరగోళ పరిస్థితి కారణంగా ఎన్నికను నిలిపేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. మొత్తంగా ఎన్నికను నిలిపేయాలని సింగిల్‌ జడ్జి ఆదేశించగా, దానిని కొట్టేస్తూ, ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. తాజాగా

oxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్‌ సర్వే షురూoxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్‌ సర్వే షురూ

ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపింది. లెక్కింపుపై ఇక ఎస్ఈసీ నిర్ణయమే తరువాయి. మార్చి నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం తెలిసిందే. మొత్తం 12 కార్పొరేషన్లకుగానూ 11 చోట్ల, 75 మున్సిపాలిటీలకుగానూ 74చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఏలూరు కార్పొరేషన్ లోనూ గెలుపు తమదేనని అధికార పార్టీ ధీమాగా ఉంది.

English summary
andhra pradesh High Court allowed state elections commission for Eluru Corporation election counting. the court on friday passed the order and pitched for covid protocol during counting. elections for Eluru Municipal Corporation were held on March 10 but due to court cases counting has been postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X