వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయేషా కేసు అప్ప‌గించిన హైకోర్టు : ఇప్పుడు బాబు సీబిఐను ఆప‌గ‌ల‌రా..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఆయేషా మీరా హ‌త్య కేసును సిబిఐ కి అప్ప‌గి స్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ కేసు లో కొత్త‌గా ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. గత కొంత కాలంగా దీనిపై విచారణ కొనసాగిస్తున్న ఉన్నత న్యాయస్థానం సిట్‌ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. కొద్ది రోజుల క్రితం ఏపి ప్ర‌భుత్వం రాష్ట్రంలో సిబిఐ విచార‌ణ జ‌ర‌గాలంటే ప్ర‌భుత్వ అనుమ‌తి ఉండాల‌ని ఉత్వ‌ర్వులు జారీ చేసింది. అయితే, ఇది కోర్టు ఉత్త‌ర్వు కావ‌టంతో సిబిఐ విచార‌ణ కొన‌సాగ‌నుంది.

విజ‌య‌వాడ లో జ‌రిగిన ఆయేషా హ‌త్య కేసు ఇప్ప‌టికే అనేక మ‌లుపులు తిరిగింది. తాజాగా, హైకోర్టు తీర్పుతో ఈ కేసు మ‌రో సారి మొద‌టి నుండి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ హ‌త్య కేసుకు సంబంధించి 2010 లో స‌త్యంబాబు ను దోషిగా తేలుస్తూ విజ య‌వాడ కోర్టు తీర్పు ఇచ్చింది. దీని పై స‌త్యంబాబు..తాను నిర్దోషిని అంటూ హైకోర్టులో అప్పీల్ కు వెళ్లారు. ఆయ‌న అప్పీ ల్ పై విచార‌ణ జ‌రిపిన ఉన్న‌త న్యాయ‌స్థానం 2016లో స‌త్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పు నిచ్చింది. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారం పై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయేషా త‌ల్లి తండ్రుల‌తో పాటుగా ప్ర‌జా -మ‌హిళా సంఘాలు హైకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ ప‌రిస్థితుల్లో ఏపి ప్ర‌భుత్వం ఈ కేసు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ ద‌ర్యాప్తు సాగిస్తున్న క్ర‌మంలో కీల‌క సాక్ష్యాధారాలు..రికార్డులు లేవ‌ని కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీని పై న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

AP High Court ordered CBI enquiry in Ayesha meera murder case..!

తాజాగా ఈ రోజు ఈ కేసు పై విచార‌ణ జ‌రిగిప కోర్టు పోలీసుల తీరు..ద‌ర్యాప్తు వ్య‌వ‌హారం పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ కేసును సిబిఐ తో విచార‌ణ జ‌రిపించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గ‌తంలో ఇచ్చిన తీర్పులు..ద‌ర్యాప్తుల‌తో ఏ మాత్రం ప్ర‌భావం కాకుండా ఈ కేసు విచార‌ణ చేప‌ట్టాల‌ని సిబిఐని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఏపిలో సిబిఐ విచార‌ణ కు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌ని ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ నిర్వ‌హించే అధికారం సిబిఐ కి ఉంటుంది. ఇప్పుడు ఆయేషా మీరా కేసులో కోర్టు తీర్పును అనుస‌రించి సిబిఐ విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఏపిలో టిడిపి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత కోర్టు ఆదేశించిన తొలి సిబిఐ విచార‌ణ కేసు ఇదే.

English summary
AP High Court ordered CBI investigation in Ayesha Meera Murder case. State government appointed SIt on this case. But, on request of Ayesha parents after argumentss..court ordered for CBI enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X