వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబకు ఊరట: 97 మందితో భద్రత కల్పించండి: జామర్ ఇవ్వండి..హైకోర్టు ఆదేశం..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత మీద హైకోర్టు తీర్పు వెల్లడించింది. న భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన పలు మార్లు విచారణ నిర్వహించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును కొద్ది సేపటి క్రితం కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని తీర్పులో స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

చంద్రబాబు భద్రత పైన హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్‌వోనే కొనసాగించాలని, కాన్వాయ్‌లో జామర్‌ కేటాయించాలని సూచించింది. క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీం విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య అభిప్రాయ భేదాలపై కలిసి చర్చించుకోని.. మూడు నెలల్లోగా ఓ నిర్ణయానికి రావాలని హైకోర్టు ఆదేశించింది. తెలిపింది. తన భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వ వాదనలను వినింది. అయితే, ప్రభుత్వం తాము నిబంధనల ప్రకారమే రక్షణ కల్పిస్తున్నామని వాదించింది. ఇప్పటికే తాము 74 మందితో భద్రత కొనసాగిస్తున్నామని కోర్టుకు నివేదించింది.

AP High court ordered Govt to arrange Security with 97 persons for Chandra babu.

భద్రత పెంచాలంటూ బాటు పిటీషన్..
మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనకు భద్రత కొనసాగించాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ పైలెట్ సైతం చంద్రబాబు కాన్వాయ్ నుండి ప్రభుత్వం తొలిగించింది. దీని పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పైన గతంలో మావోయిస్టుల దాడి జరిగిందని..ఆయనకు మావోయిస్టులతో పాటుగా ఎర్ర చందనం స్మగ్లర్ల నుండి హానీ ఉందని టీడీపీ నేతలు కోర్టుకు నివేదించారు. తమకు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే భద్రతను కుదించిందని కోర్టుకు వివరించారు. కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా ప్రముఖ భద్రత సమీక్షలో భాగంగా చంద్రబాబుకు క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీం భద్రత కొనసాగించాలని నిర్ణయించింది. కానీ, ఏపీలో మాత్రం ప్రభుత్వం చంద్రబాబు భద్రత మీద ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీని పైన హోం మంత్రి సుచరిత సైతం వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో హై కోర్టులో చంద్రబాబు పిటీషన్ పైన వాదనలు కొనసాగాయి. చివరకు హైకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీని మేరకు ఇక నుండి ఏపీ ప్రభుత్వం 97 మందితో భద్రత కల్పించి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది. దీని పైన టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
AP High court ordered Govt to arrange Securty with 97 persons for Chandra babu. On Chandra babu petition court condcuted trails and given judement in favour of Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X