వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆనందయ్య కంటి మందును పరిశీలించండి: ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారుచేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిగింది.

ఆనందయ్య చేసుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. అయితే, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ap high court orders to AP Govt on anandaiah medicine

ఈ క్రమంలో దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందరు మరణించారని నిలదీసింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలని స్పష్టం చేసింది.

ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 నమూనాలను పరీక్షించగా.. 400 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

కొత్తగా నమోదైన 400 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,63,577కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు.
చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,343కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 516 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,44,132కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,102 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,64,255 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 08, చిత్తూరులో 73, తూర్పుగోదావరిలో 31, గుంటూరులో 50, కడపలో 25, కృష్ణాలో 68, కర్నూలులో 03, నెల్లూరులో 22, ప్రకాశంలో 09, శ్రీకాకుళంలో 29, విశాఖపట్నంలో 33, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,232, చిత్తూరులో 2,46,419 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,914) కరోనా కేసులున్నాయి.

English summary
ap high court orders to AP Govt on anandaiah medicine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X