• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మూడు రాజధానులపై హైకోర్టు షాకింగ్‌ -తరలింపు మతిలేని చర్య- గుండె తరుక్కుపోతోందంటూ..

|

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కాక రేపుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం పంపిన రెండు కీలక బిల్లులను గవర్నర్‌ ఆమోదించినా వాటిపై అభ్యంతరాలతో పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాదు రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్‌ సర్కారుకు షాకిచ్చేలా ఉన్నాయి. రాజదాని తరలింపు మతిలేని చర్య అంటూ హైకోర్టు చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్త్గంగా చర్చనీయాంశమవుతున్నాయి.

 విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న కేసు...

విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న కేసు...

విశాఖపట్నంలో గతేడాది విపక్ష నేత చంద్రబాబు పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది. ఈ కేసులో పిటిషనర్‌ చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం మతిలేని చర్యగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యపై ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ రోజు ప్రజలు ఉద్వేగంలో ఉన్నందున చంద్రబాబున అడ్డుకున్నారంటూ ప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు కాదు కొంతమంది మాత్రమే అలా ఉద్వేగంతో ఉన్నారని తెలిపింది. ఈ సందర్భంగా కేసుకు, పిటిషన్‌కు సంబంధం లేని పలు అంశాలు తెరపైకి వచ్చాయి.

 జగన్‌ సర్కారుది మతిలేని చర్యే...

జగన్‌ సర్కారుది మతిలేని చర్యే...

విశాఖలో చంద్రబాబును ప్రభుత్వం అడ్డుకోవడం మతిలేని చర్య అని ఎలా అంటారని ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నిస్తే దీనికి స్పందనగా హైకోర్టు.. మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి తెస్తూ రాజధాని తరలింపు మాత్రం మతిలేని చర్య కాదా అని ఎదురు ప్రశ్నించింది. అలాగే తమ ఇళ్లు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ తమ వద్దకు వస్తున్న పిటిషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఖాళీ చేయించడం మతిలేని చర్య కాదా అని ధర్మాసనం ప్ర

 రాజధాని అంశం తీసుకురావడంపై వాదోపవాదాలు...

రాజధాని అంశం తీసుకురావడంపై వాదోపవాదాలు...

అయితే ఈ పిటిషన్‌కు సంబంధం లేని రాజధాని అంశాన్ని ధర్మాసనం ప్రస్తావించడంపై ప్రభుత్వ న్యాయవాది ప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజధాని పిటిషన్లు విచారిస్తున్న ధర్మాసనంలో ఈ పిటిషన్‌ విచారిస్తున్న న్యాయమూర్తి లేరు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు, న్యాయస్ధానాలు కూడా విచారణ పరిధిని విస్మరిస్తున్నాయంటూ ప్రభుత్వ న్యాయవాది తన అభ్యంతరాలు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం మీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసమే అన్నీ చేస్తోందా అని ఎదురు ప్రశ్నించింది. ఇవి తమ వ్యక్తిగత అభిప్రాయాలు అని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

 అమరావతి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది..

అమరావతి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది..

అమరావతిలో హైకోర్టుకు వచ్చేటప్పుడు ఇక్కడ ఆగిపోయిన నిర్మాణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తగిన సౌకర్యాలు లేకపోవడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వస్తే కనీసం మంచినీరు, టీ కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నామన్నారు. చీకటి పడితే వెనక్కి రావడం కూడా కష్టమన్నారు. అనారోగ్యానికి గురైనా దిక్కులేదన్నారు. చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఏమీ దొరకదన్నారు. గత ప్రభుత్వం ఈ అడవికి ఎందుకు తీసుకొచ్చిందో కూడా తెలియదన్నారు. రాజధాని ఇక్కడే ఉంటే రూ.100 కోట్ల నష్టం జరుగుతుందని, తరలిస్తే రూ.10 కోట్లు ఖర్చవుతుందన్నారు.

  AP State Road Toll Fees : రాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజాలు, రహదారి పన్నులు.... టోల్ ఫీజు ఎంతంటే ?
   జగన్‌పై హైకోర్టు పరోక్ష కామెంట్లు...?

  జగన్‌పై హైకోర్టు పరోక్ష కామెంట్లు...?

  విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పనిసరిగా చట్టం చేయాలి. లేకుంటే క్రిమినల్స్‌ ఉన్నత పదవుల్లో కూర్చుని ప్రజాస్వామ్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్యూన్ ఉద్యోగానికి వచ్చిన వారికి కూడా విద్యార్హతలు, నేరచరిత్ర గురించి ఆరా తీస్తారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవేవీ అవసరం లేదా అని ధర్మాసనం ప్రశ్నించింది. నేరస్తులు అధికారంలోకి రాకుండా నిలువరించే చట్టాల రూపకల్పనపై ఎవరూ ఆలోచించడం లేదు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెబుతోంది. నేరస్తులు నిప్పుతో చెలగాటమాడుతున్నారని, ఏదో ఒక రోజు వారిని దహించివేయడం ఖాయమని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

  English summary
  andhra pradesh high court made serious comments on formation of three capitals in the state. high court says that shifting of capital is mindless act.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X