వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ డీజీపీపై హైకోర్టు సీరియస్‌- పోలీసుల తీరు మారకపోతే రాజీనామా చేయాలని వార్నింగ్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో వరుసగా నమోదవుతున్న మిస్సింగ్‌ కేసులపై హైకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మిస్సింగ్‌ కేసుల విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించినా ఇంకా పోలీసుల తీరులో మార్పు రావడం లేదని సీరియస్‌ అయింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి తాజాగా అదృశ్యం కావడంపై దాఖలైన హెబియస్ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు డీజీపీ సవాంగ్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో వరుస మిస్సింగ్‌ కేసులకు పోలీసులదే బాధ్యత అని హైకోర్టు తెలిపింది. ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం విషయంలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసిన మేనమామ వెంకట్రాజు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మూడుసార్లు జ్యుడిషియల్‌ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పోలీసు వ్యవస్ధ గాడితప్పుదోందని వ్యాఖ్యానించింది. పోలీసు వ్యవస్ధను కంట్రోల్‌ చేయలేకపోతే రాజీనామా చేయాలని హైకోర్టు డీజీపీ సవాంగ్‌కు సూచించింది. గతంలో పలుమార్లు డీజీపీని హైకోర్టుకు రప్పించినా మార్పు రాలేదని ధర్మాసనం తెలిపింది. ప్రతీసారి ఇలాంటి పరిస్ధితి వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్బంగా ప్రతీ కోర్టులోనూ సీబీఐ విచారణ సాధ్యం కాదని గతంలో గుంటూరు పోలీసుల విషయంలో జారీ చేసిన ఆదేశాలను గుర్తు చేసింది.

ap high court serious on dgp sawang after series of missing cases

Recommended Video

APSRTC : Andhra Pradesh లో City Bus లు నడిపేందుకు సిద్దమైన APSRTC || Oneindia Telugu

ఏపీలో వ్యక్తులు అదృశ్యం కావడం, వారి బంధువుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తమ బంధువుల
ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లకు వచ్చినప్పుడు పోలీసుల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. పోలీసులను తీరు మార్చుకోవాలని డీజీపీ సవాంగ్‌ పలుమార్లు కోరినా మార్పు రావడం లేదు. దీంతో హైకోర్టు గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓసారి సీబీఐ విచారణకు సైతం ఆదేశాలు ఇచ్చింది. అయినా తాజాగా ఇలాంటిదే మరో కేసు రావడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
andhra pradesh high court on monday serious over police department in the state. high court especially criticizes dgp gowtham sawang for not controlling missing incidents in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X