జగన్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం-ఎయిడెడ్ విలీనంపై తడబాటు-స్వచ్ఛందమేనని క్లారిటీ
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలోకి విలీనం చేసుకునేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఇవాళ హైకోర్టుకు మాత్రం అదే విషయాన్ని చెప్పలేకపోయింది. ప్రభుత్వంలోకి ఎయిడెడ్ విద్యాసంస్ధల విలీనంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు వేసిన ప్రశ్నలకు ఇబ్బంది పడిన ప్రభుత్వం చివరికి తేరుకుని క్లారిటీ ఇచ్చేసింది.
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని విలీనం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. దీంతో ప్రభుత్వ న్యాయవాదులు ఇరుకునపడ్డారు. జీవోల్లో ఓ సమాచారం ఇచ్చి, కోర్టుకు మరో సమాచారం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్త చేసింది. చివరికి జీవోల్ని సైతం న్యాయమూర్తి చదివి వినిపించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదులు తెల్లమొహం వేయాల్సి వచ్చింది.
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. స్పష్టమైన సమాచారం లేదంటూ తీవ్ర అభ్యంతం తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో ఒక సమాచారం ఉండగా, క్షేత్ర స్థాయిలో మరోలా జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వం తరుపు లాయర్ చెప్పారు. దీంతో ఛీఫ్ జస్టిస్ స్వయంగా తానే జీవో చదివి వినిపించారు.

దీంతో
స్పందించిన
ప్రభుత్వ
న్యాయవాది
స్వచ్ఛందంగా
విలీనమయ్యే
ఎయిడెడ్
విద్యాసంస్థలను
మాత్రమే
విలీనం
చేస్తున్నామమని
హైకోర్టుకు
తెలిపారు.
దీనిపై
న్యాయస్ధానం
సంతృప్తి
చెందలేదు.
న్యాయస్థానానికి
స్పష్టమైన
సమాచారం
ఇవ్వాలని
సీజే
న్యాయవాదులకు
సూచించారు.
ఎయిడెడ్
విద్యాసంస్ధల
విలీనంపై
పూర్తి
క్లారిటీ
ఇచ్చేందుకు
ఈనెల
29న
డైరెక్టర్
ఆఫ్
స్కూల్
ఎడ్యుకేషన్
కమిషనర్
చినవీరభద్రుడు
నేరుగా
హాజరుకావాలని
హైకోర్టు
ఆదేశాలు
ఇచ్చింది.
తదుపరి
విచారణను
హైకోర్టు
ఈ
నెల
29కి
వాయిదా
వేసింది.
వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన ఎయిడెడ్ విద్యాసంస్ధల విలీనం ఉత్తర్వుల్ని అమలు చేయలేక, చాలా విద్యాసంస్ధలు ఇప్పటికే మూసివేత బాట పడుతున్నాయి. తాజాగా విజయవాడలోని దశాబ్దాల చరిత్ర కలిగిన మాంటిస్సోరి స్కూల్ ను మూసేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని విద్యాసంస్ధలు కూడా ఇదే బాట పట్టనున్నాయి. ప్రభుత్వం మాత్రం టీచర్లతో పాటు విద్యాసంస్ధల్ని, వాటి భవనాల్ని, స్ధలాల్ని కూడా తీసుకుంటామని చెబుతోంది. కానీ ఎయిడెడ్ విద్యాసంస్ధలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.