• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏది రహస్యం ? జగన్ సర్కార్ కు హైకోర్టు సూటి ప్రశ్న-ఫలితమివ్వని దిద్దుబాటు

|

ఏపీలో వైసీపీ సర్కార్ రాకముందే రహస్య జీవోల వ్యవహారం గుట్టుగా సాగిపోయేది. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనూ వందలాది జీవోలు రహస్యంగానే ఉంచేవారు. కాన్ఫిడెన్షియల్ అనే ఓ పదం వాడేసి జీవోను వెబ్ సైట్లో పెట్టినట్లే పెట్టి వివరాలు బయటపెట్టేవారు కాదు. తద్వారా తాము అనుకున్న ఉత్తర్వులు బయటపెట్టినట్లే పెట్టి గోప్యత పాటించేవారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వాలు లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు వైసీపీ సర్కార్ హయాంకు వచ్చేసరికి వివాదాలు పెరగడం, ఇతరత్రా కారణాలతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు హైకోర్టే నేరుగా రహస్యమేంటో చెప్పాలని అడిగేసింది.

SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)

ఏపీలో రహస్య. జీవోల ప్రస్ధానం

ఏపీలో రహస్య. జీవోల ప్రస్ధానం

ఏపీలో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాం నుంచీ తాము ప్రజలకు చెప్పకూడదని భావించిన విషయాలపై జారీ చేసే ఉత్తర్వులను గుట్టుగా విడుదల చేసేవారు. రాత్రి సమయంలో విడుదల చేయడం, వివరాలు లేకుండా కాన్ఫిడెన్షియల్ అనే పేరుతో విడుదల చేయడం, లేదా జీవో పెట్టినట్లే పెట్టి అది ఓపెన్ కాకుండా పెట్టడం ఇలా పలు రహస్య మార్గాలో కొన్ని జీవోలు విడులయ్యేవి. అంటే ఇవి బయటపడితే ప్రభుత్వానికి కచ్చితంగా విమర్శలు తప్పవనో, వివాదాలు నెలకొంటాయనో భయం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రహస్య జీవోల వ్యవహారం వెలుగుచూసేది. సదరు జీవోలు విడుదలైన తర్వాత కొన్ని రోజులకు సదరు శాఖలో చోటు చేసుకున్న కీలక పరిణామాల్ని మీడియాతో పాటు సాధారణ ప్రజలు, ఉద్యోగులు సరి చూసుకుని అప్పుడు ఈ జీవో రహస్యాన్ని ఛేదించేవారు. రాష్ట్రంలో ఇప్పటికీ అదే పరిస్ధితి.

 విమర్శల్ని లెక్కచేయని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు

విమర్శల్ని లెక్కచేయని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు

గతంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలో రహస్య జీవోలు విడుదలైనప్పుడు వాటిపై విపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వారిని ప్రభుత్వాలు లెక్క చేసేవి కావు. వాటి గుట్టును సైతం బయటపెట్టేవి కావు. ఎన్ని విమర్శలు ఎదురైనా తామింతే అనేలా వ్యవహరించేవి. దీంతో సామాన్యులతో పాటు మీడియా, అధికార వర్గాలకు సైతం ఈ జీవోల్లో ఏముందనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయేది. చివరికి ఈ రహస్య జీవో ఏ శాఖలో వచ్చిందో చూసుకుని కొన్ని రోజుల తర్వాత దాని వల్ల చోటు చేసుకున్న పరిణామాలు ఆరా తీసి ఫైనల్ గా దాని గుట్టు ఛేదించేవారు. దీంతో రహస్య జీవోల వ్యవహారం ఎప్పుడూ ఎవర్ గ్రీన్ గా ఉండేది.

వైసీపీ హయాంలోనూ అదే స్ధితి

వైసీపీ హయాంలోనూ అదే స్ధితి

గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో రహస్య జీవోలపై నానా రచ్చ చేసిన వైసీపీ తాము అధికారంలోకి రాగానే అంతకంటే ఎక్కువ రహస్య జీవోల్ని విడుదల చేయడం మొదలుపెట్టింది. రహస్య జీవోలు, అర్ధరాత్రి ఉత్తర్వులతో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా మీడియాతో పాటు సాధారణ ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది. వైసీపీ సర్కార్ విడుదల చేస్తున్న రహస్య జీవోల్లో ఉండే అంశాలు ఆ తర్వాత ఎన్నో వివాదాలకు దారి తీస్తుండటంతో ఈ రహస్య జీవోల పంచాయతీ కాస్తా గవర్నర్ రాజ్ భవన్ కూ చేరిపోయింది. అయినా ప్రభుత్వం లెక్కచేయని పరిస్ధితి.

జీవోల వెబ్ సైట్ బంద్

జీవోల వెబ్ సైట్ బంద్

గత ప్రభుత్వాల హయాంలో తెరపైకి వచ్చిన జీవోఐఆర్ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్ సైట్ ను తాము అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ సర్కార్ కొనసాగించింది. అయితే ఈ మధ్య వివిధ కారణాలతో ఆ వెబ్ సైట్ ను నిలిపేస్తూ ఇకపై జీవోలు బహిర్గతం చేయబోమని తేల్చిచెప్పేసింది. అంతే కాదు వివిధ ప్రభుత్వ శాఖలకూ తమ ఉత్తర్వులు అంతర్గతంగా మాత్రమే విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో ఈ వ్యవహారం గవర్నర్ కూ, ఆ తర్వాత హైకోర్టుకూ చేరింది. దీంతో వైసీపీ సర్కార్ చేసేది లేక దిద్దుబాటు చర్యలకు దిగింది.

జీవోల కోసం కొత్త వెబ్ సైట్

జీవోల కోసం కొత్త వెబ్ సైట్


ఎప్పుడైతే జీవోలు పెట్టే జీవోఐఆర్ వెబ్ సైట్ లో ప్రభుత్వం జీవోలు పెట్టడం ఆపేసిందో అప్పుడు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో న్యాయపరమైన వివాదం తలెత్తేలా కనిపించింది. ఈ సమయంలో అధికారుల సూచన మేరకు దాన్ని పునరుద్ధరించలేక చివరికి మరో కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇలా కొత్త వెబ్ సైట్ తీసుకొస్తున్నట్లు అంతకుముందు చెప్పని వైసీపీ సర్కార్.. ముప్పేట దాడి, హైకోర్టులో పిటిషన్లలో దిగొచ్చింది. చివరికి ఏపీ ఈగెజిట్ పేరుతో కొత్త వెబ్ సైట్ ఏర్పాటైంది. ఇందులో జీవోలు పెట్టడం మొదలుపెట్టారు. అత్యంత రహస్యం, రహస్యం, గోప్యం పేరుతో మూడు కేటగిరీల్లో రహస్య జీవోలు ఉంటాయని, వాటిని మాత్రం వెబ్ సైట్ లో పెట్టబోమని ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పేసింది. దీనిపై మళ్లీ అభ్యంతరాలు మొదలయ్యాయి

  Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
  రహస్యం'పై ఇరుకునపడ్డ జగన్ సర్కార్ ?

  రహస్యం'పై ఇరుకునపడ్డ జగన్ సర్కార్ ?

  జీవోలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అసలు రహస్య జీవోలంటే ఏంటని సర్కార్ ను ప్రశ్నించింది. బిజినెస్ రూల్స్ ప్రకారమే తాము జీవోల్ని రహస్యంగా పెడుతున్నట్లు ప్రభుత్వం చేసిన వాదనను సైతం హైకోర్టు అంగీకరించలేదు. ఎప్పుడో చేసిన చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామంటే ఎలా అని ప్రశ్నించింది. కాలంతో పాటు మారాలని సూచించింది. ప్రభుత్వం రహస్య జీవోల దాపరికంపై జారీ చేసిన జీవోను సైతం పిటిషనర్లకు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు తాజా వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహస్య జీవోలపై జగన్ సర్కార్ ఇరుకునపడినట్లయింది.

  English summary
  andhrapradesh, ys jagan, jagan govt, g.o.s, government orders, confidential, high court, petitions, website, ap govt, ap news,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X