వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్: పోలవరం పవర్ ప్రాజెక్టు పనులకు బ్రేక్: స్టే విధించిన హైకోర్టు..!

|
Google Oneindia TeluguNews

పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు పనులకు మరో సారి బ్రేక్ పడింది. నవయుగ పిటీషన్ విచారించిన హైకోర్టు పనులు కొనసాగింపు మీద స్టే విధించింది. దీని మీద ప్రతివాదులను నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణ మంగళవారినికి వాయిదా వేసింది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం ప్రాజెక్టుతో పాటుగా హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల నుండి టీడీపీ హాయంలో పనులు దక్కించుకున్న నవయుగ సంస్థను తప్పించారు. తొలుత హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు నవయుగకు రద్దు చేయగానే ఆ సంస్థ కోర్టుకు వెళ్లటంతో..జెన్ కో ఇచ్చిన పనులు నిలిపివేత ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.

ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బ

దీని పైన ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయగా కోర్టు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగిస్తూ..కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో.. గత వారం రివర్స టెండరింగ్ ద్వారా పనులు దక్కించుకున్న మేఘా సంస్థ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ తో పాటుగా హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు ఏక కాలంగా కొనసాగించేలా పనులు ప్రారంభించింది. తిరిగి దీని పైన నవయుగ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..కోర్టు తాజాగా మరో సారి పనులు నిర్వహణ పైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్త్వర్వులు ఇచ్చింది.

AP High court stay on polavaram hydel power project works

3216 కోట్లోత హైడల్ పవర్ ప్రాజెక్టు..
హైడల్ పవర్ ప్రాజెక్టు పనుల నుండి జగన్ ప్రభుత్వం తమను తప్పించగానే నవయుగ కోర్టును ఆశ్రయిచింది. పోలవరం జల విద్యుత్ ప్రాజక్టు పనుల విలు 3216 కోట్లు. మరో వైపు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్, హైడల్ వర్క్స్ పనులను ఒకే కాంపోనెంట్ కింద రివర్స్ టెండరింగ్ 4,987 కోట్లకు పిలవగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ 12.6శాతానకి తక్కువుగా కోట్ చేసి 4,358 కోట్లకు పనులను దక్కించుకుంది.

అలాగే ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాలువకు సంబంధించిన కొన్ని ప్యాకేజీలకు రివర్స్ టెండర్ జలవనరుల శాఖ పిలిచింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు 850కోట్లు ఆదా అయింది. అయితే హైకోర్ట్ స్టే తో కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నా మెగా ఇంజినీరింగ్ సంస్థ జలవనరుల శాఖతో ఒప్పందం చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. గత వారం కోర్టు స్టే ఎత్తివేయటంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒకే సారి హెడ్ వర్క్స్ తో పాటుగా హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది.

ఇప్పుడు తిరిగి నవయుగ కోర్టును ఆశ్రయించింది. దీంతో..కోర్టు స్టే విధించింది. దీంతో పాటుగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మంగళవారి ఈ వ్యవహారం పైన విచారణ సాగే అవకాశం ఉంది. గత వారమే ప్రారంభమైన హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు తిరిగి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

English summary
AP High court stay on polavarm hydal power project works. High court given notices to respondents on Navayuga petition. Cse psoted to tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X