వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు హైకోర్టు షాక్ : నవయుగ ఒప్పందం రద్దు సస్పెన్షన్ : రివర్స టెండర్ కు బ్రేక్...!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలవరంలో రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. నవయుగకు హైడల్ ప్రాజెక్టు టెందర్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీజెన్ కో పోలవరం జల విద్యుత్ కేంద్రం కోసం గతంలో నవయుగతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవయుగకు నోటీసు ఇచ్చింది. అయితే, ప్రభుత్వం పోలవరం మొత్తంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లటంతో ఈ వ్యవహారం పైన నవయుగ సంస్థ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. తాము ఏపీ జెన్ కో తో ఒప్పందం చేసుకున్నామని.. ప్రభుత్వ కేవలం ధర్డ్ పార్టీ అని కోర్టుకు నివేదించింది. దీని పైన అటు ప్రభుత్వం..ఇటు నవయుగ వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. తాజా తీర్పుతో పోలవరం రివర్స్ టెండరింగ్ లో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో..పోలవరం వ్యవహారం పపైన కొత్త సందేహాలు మొదలవుతున్నాయి.

<strong>ఆ కేంద్ర మంత్రులకు సీఎం జగన్..సాయిరెడ్డి షాక్ : టీడీపీ నేతలు ఊహించలేని.. : అమరావతి పైనా అంతేనా..!!</strong>ఆ కేంద్ర మంత్రులకు సీఎం జగన్..సాయిరెడ్డి షాక్ : టీడీపీ నేతలు ఊహించలేని.. : అమరావతి పైనా అంతేనా..!!

ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

ఏపీ ప్రభుత్వం పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ జెన్ కో కొద్ది రోజల క్రితం పోలవరం జల విద్యుత్ కేంద్రం కాంట్రాక్టును నవయుగ నుండి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవయుగ సంస్థకు నోటీసు ఇచ్చింది. ఆ తరువాత మొత్తం ప్రాజెక్టుతో పాటుగా జల విద్యుత్ కేంద్రం నిర్మాణం పైన రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని పైన నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమతో ఒప్పందం చేసుకున్నది ఏపీ జెన్ కో అంటూ.. ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని కోర్టులో నవయుగ వాదించింది. తమకు అప్పగించిన హైడల్ ప్రాజెక్టుకు సంబంధించి మరింత కాలం సమయం ఉందని..రూ. 3200 కోట్ల మేర పనులు సకాలంలో చేస్తున్నామని కోర్టుకు వివరించింది. ఏపీ జెన్ కో తమకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని..ప్రాజెక్టు నిర్మాణ స్థలం కేటాయింపులో అలసత్వం చూపించిందని నవయుగ న్యాయవాది వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరపున వాదనలు కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ఒప్పందం రద్దు చేస్తే ఆర్బిట్రేషన్ కు వెళ్లాలి కానీ.. కోర్టుకు రావటం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరి వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.

రివర్స్ టెండరింగ్ లో ముందుకు వద్దు..

రివర్స్ టెండరింగ్ లో ముందుకు వద్దు..

ఏపీ ప్రభుత్వం దేశంలోనే తామే తొలి సారిగా రివర్స్ టెండరింగ్ అమలు చేస్తున్నామంటూ చెబుతున్న సమయంలో..కోర్టు తీర్పు ఇబ్బంది కరంగా మారుతోంది. ఏపీ ప్రభుత్వం పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ లో భాగంగా రూ. 4987 కోట్లు హెడ్ వర్క్స్ తో పాటుగా జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి నోటీఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు కోర్టు ఏపీ జెన్ కో ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయటంతో పాటుగా టెండర్ల విషయంలో ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా నవంబర్ 1 వ తేదీ నుండి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. నవయుగ వాదనల ప్రకారం తామ నిర్ణీత కాల పరిమితిలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటానికి సిద్దంగా ఉన్నామని ఆ సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీంతో పాటుగా ఏపీ లో ప్రభుత్వం మారిన తరువాత కొన్ని ప్రత్యేక కారణాల వల్లనే తమ కాంట్రాక్టు ఏపీ జెన్ కో రద్దు చేస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. అయితే, ఇప్పుడు టెండర్ల విషయంలో ముందుకు వెళ్లవద్దని కోర్టు స్పష్టం చేయటం ద్వారా ఇది ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మారనుంది.

పోలవరం భవితవ్యం ఏంటి..

పోలవరం భవితవ్యం ఏంటి..

ఇప్పుడు ఒక వైపు ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులు నిలిపివేయటంతో పాటుగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. దీని పైన కోర్టు రివర్స్ టెండరింగ్ కు ముందుకు వెళ్లవదని కోర్టు ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఇది కేవలం హైడల్ ప్రాజెక్టు వరకే ఈ తీర్పు పరిమితం అవుతుందా మొత్తంగా ప్రాజెక్టు ఒప్పందం మీద ప్రభావితం చూపుతుందా అనే కోణంలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. దీని ద్వారా పోలవరం నిర్మాణ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మీద ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇక, తాజాగా కోర్టు తీర్పు తరువాత ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది మరింత ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడు కేంద్ర స్పందన కూడా కీలకంగా మారుతోంది.

English summary
AP High court suspended Ap Genco order that given to Navayuga to cancel tender for hydal pwoer project in polavaram. At the same time court order to dont continue reverse tendering in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X