వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బ

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నుండి తమను తప్పించటం పైన హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ కు ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్మాణ సంస్థతో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించటానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో..ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో కొత్త కాంట్రాక్టర్ ద్వారా పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. చంద్రబాబు హాయంలో నవయుగ సంస్థకు పోలవరం ప్రాజెక్టుతో పాటుగా హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత ఆ ఒప్పందం నుండి నవయుగను తప్పిస్తూ నిర్ణయించారు. దీన పైన నవయుగ హైకోర్టును ఆశ్రయించగా..గతంలో ఇచ్చిన స్టేను తొలిగిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది.

పోలవరం వద్ద మళ్ళీ కుంగిన భూమి .. భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు పోలవరం వద్ద మళ్ళీ కుంగిన భూమి .. భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు

పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టుతో పాటుగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న నవయుగను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని పైన నవయుగ సంస్థ తమను హైడల్ విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం నుండి నిబంధనలకు వ్యతిరేకంగా తప్పించారంటూ కోర్టును ఆశ్రయించింది. దీని పైన కోర్టు గతంలోనే కోర్టు స్టే ఇచ్చింది. దీని పైన అనేక సార్లు వాదనలు సాగాయి. ఈ రోజు జరిగిన వాదనల్లో ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ వాదనలు వినిపించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేస్తూ.. తాజాగా ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకొనే విధంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఏకీభవించిన హైకోర్టు గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేసింది. అదే సమయంలో కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకొని..పనులు ప్రారంభించటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో..ఇప్పుడు నవయుగ సంస్థ దీని పైన న్యాయపరంగా తదుపరి అడుగులు ఎలా వేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

AP high court vacates stay on Polavaram Hydel project

మేఘాకు ప్రాజెక్టు పనులు..
ఇక, ఇప్పటికే పోలవరం లో రివర్స్ టెండరింగ్ ద్వారా గతం కంటే దాదాపు రూ. 900 కోట్ల మేర తగ్గుదలతో మేఘా సంస్థ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. అయితే న్యాయ పరమైన అనుమతులతో పాటుగా సాంకేతికంగా ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తరువాత పనులు ప్రారంభించేందుకు సిద్దమని ప్రకటించింది. ప్రభుత్వం సైతం రివర్స్ టెండిరింగ్ ద్వారా ప్రజా ధనం ఆదా అయిన విషయాన్ని కేంద్రానికి సైతం నివేదించింది. ఇక, ఇప్పుపడు హైడల్ ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వానికి ముందుకెళ్లటానికి అనుమతి ఇవ్వటంతో దీనికి సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. వరదలు దగ్గిన తరువాత నవంబర్ నుండి పనులు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో..ఈ నెలలో పనులు ప్రారంభించాల్సి ఉంది. అదే విధంగా కేంద్రం నుండి రావాల్సిన బకాయిల విషయంలోనూ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

English summary
AP high court vacated stay on Polavram Hydal project works..permitted to allocation for new contractor. Navayuga approached High court after AP Govt cancel their contract. Now Ap govt may move for new contractor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X