వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎంసెట్‌లో 78 శాతం ఉత్తీర్ణ‌త‌: మొబైల్స్‌కు ర్యాంకుల వివ‌రాలు : 10నుంచి ర్యాంకు కార్డులు..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు సోమవారం ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపించనున్నారు. ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ నెల 10నుంచి ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

78 శాతం ఉత్తీర్ణ‌త‌..
ఏపీ ఎంసెట్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,82,901 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. వీరిలో ఇంజినీరింగ్‌కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్యవిభాగ పరీక్షలకు 81,916 మంది హాజరయ్యారు. తెలంగాణకు చెందిన 36,698 విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరయ్యారు.తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల కారణంగా ఏపీఎంసెట్‌ ఫలితాల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎంసెట్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (84శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు.

AP Higher education released EAMCET-2019 results to day. Total 78 percentage students qualified in this exam.

మొబైల్స్‌కు ర్యాంకుల వివ‌రాలు..
అభ్య‌ర్దుల ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపించనున్నారు. ఇంజనీరింగ్‌లో పినిశెట్టి రవితేజకు ఫస్ట్ ర్యాంకు రాగా.. మెడికల్‌లో వెంకట సాయి స్వాతికి తొలి ర్యాంకు వచ్చింది. వెబ్‌సైట్లలో కూడా ఎంసెట్‌ ఫలితాలు అందుబాటులో ఉంచారు. ఈ నెల 10నుంచి ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంజ‌నీరింగ్..మెడిక‌ల్ కేట‌గిరీల్లో తొలి ప‌ది ర్యాంక‌ర్ల వివరాల‌ను ప్ర‌కటించారు. అదే విధంగా ప్ర‌శ్నాప‌త్రంతో పాటుగా కీ సైతం అభ్య‌ర్దుల మెయిల్స్‌కు పంపిస్తామ‌ని వెల్ల‌డించారు.

English summary
AP Higher education released EAMCET-2019 results to day. Total 78 percentage students qualified in this exam. Ranks sending to students mobiles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X