విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగా విగ్రహ 'రాజకీయం': హుటాహుటిన బందరుకు హోంమంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో జిల్లా హెడ్ క్వార్టర్ బందరులో ఆదివారం నాడు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో శాంతిభద్రలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తుతుందని తెలియడంతో స్వయంగా హోంమంత్రి చినరాజప్ప రంగంలోకి దిగారు.

వాస్తవానికి ఈరోజు హోం మంత్రి చినరాజప్ప విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. రంగా విగ్రహాం ధ్వంసం నేపథ్యంలో ఆయన విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన బందరు పర్యటనకు బయల్దేరారు. మరికాసేపట్లో బందరుకు ఆయన చేరుకుంటారు.

ఈ ఘటనకు గల కారణాలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు బందరులో శాంతిభద్రతలను హోం మంత్రి చినరాజప్ప పరిశీలించనున్నారు. మరోవైపు ఈ ఘటనపై వంగవీటి రంగా కుమారుడు రాధా ఆదివారం బందరులో పర్యటించారు. తన తండ్రి వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తేలికగా వదిలిపెట్టబోమని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు.

AP Home minister Chinna rajappa going to machilipatnam

ఆదివారం మధ్యాహ్నం విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాధా రాకతో నిజాంపేట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

విగ్రహం ధ్వంసం జరుగుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం నిందితులను పట్టుకోకుంటే తన స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మచిలీపట్నంలో కాపు సంఘం నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. రేవతి సెంటరులోని రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కొద్దిసేపు ధర్నా జరిపారు.

ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు.

అమరావతి: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో జిల్లా హెడ్ క్వార్టర్ బందరులో ఆదివారం నాడు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో శాంతిభద్రలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తుతుందని తెలియడంతో స్వయంగా హోంమంత్రి చినరాజప్ప రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈరోజు హోం మంత్రి చినరాజప్ప విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. రంగా విగ్రహాం ధ్వంసం నేపథ్యంలో ఆయన విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన బందరు పర్యటనకు బయల్దేరారు. మరికాసేపట్లో బందరుకు ఆయన చేరుకుంటారు. ఈ ఘటనకు గల కారణాలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు బందరులో శాంతిభద్రతలను హోం మంత్రి చినరాజప్ప పరిశీలించనున్నారు. మరోవైపు ఈ ఘటనపై వంగవీటి రంగా కుమారుడు రాధా ఆదివారం బందరులో పర్యటించారు. తన తండ్రి వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తేలికగా వదిలిపెట్టబోమని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. ఆదివారం మధ్యాహ్నం విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాధా రాకతో నిజాంపేట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహం ధ్వంసం జరుగుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం నిందితులను పట్టుకోకుంటే తన స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మచిలీపట్నంలో కాపు సంఘం నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. రేవతి సెంటరులోని రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కొద్దిసేపు ధర్నా జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన చైర్మన చలమలశెట్టి రామానుజయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో రంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహ ధ్వంసంపై సీఎం ఆగ్రహం రాష్ట్రంలో కొన్ని స్వార్ధ శక్తులు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం డీజీపీ రాముడుతో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని ఆదేశించారు.

దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన చైర్మన చలమలశెట్టి రామానుజయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో రంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

విగ్రహ ధ్వంసంపై సీఎం ఆగ్రహం
రాష్ట్రంలో కొన్ని స్వార్ధ శక్తులు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం డీజీపీ రాముడుతో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని ఆదేశించారు.

English summary
AP Home minister Chinna rajappa going to machilipatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X