వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు-కొత్త సీఎస్‌ ఆదిత్యనాథ్‌- నీలం, శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇవాళ పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరు అధికారులకు కీలక స్దానాలు అప్పగించింది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని డిసెంబర్ 31తో రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిటైరవుతున్న నీలంతో పాటు మరికొందరు సీనియర్ అధికారులకు కీలక బాధ్యతలు దక్కాయి.

నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్య నాథ్ దాస్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత సీఎస్ నీలం సహని పదవీకాలం ఈ నెల 31 తో ముగుస్తుంది. వచ్చే నెల అంటే కొత్త ఏడాదిలో జనవరి 1నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా ఆదిత్యనాథ్ విధులు నిర్వహిస్తున్నారు ఆదిత్యనాథ్ దాస్... సీనియర్ ఐఏఎస్ గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు..

ap ias transfers- adityanath das as new cs, srilakshmi posted as ma&ud secretary


ఈ నెలాఖరుతో రిటైరవుతున్న నీలం సాహ్నీ సేవలు మరికొంతకాలం ఉపయోగించు కోవడానికి అమెను సీఎం ముఖ్య సలదారుగా కాబినెట్ హోదా తో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పటికే సీఎస్ పదవీకాలం రెండు సార్లు.పొడిగించారు...సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల్లో నీలం సాహ్నీ చాలా చురుగ్గా ఉన్నారు..సీఎం జగన్ దృష్టిలో సమర్ధ అధికారిని గా పేరు తెచ్చుకున్నారు.. అందుకే ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు జగన్.
నీలం సహనికి కాబినెట్ రాంక్ ఇస్తూ సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా.నియమించారు. క్యాబినెట్ హోదాలో ఆమె ఇక నుంచి పని చేస్తారు .

ap ias transfers- adityanath das as new cs, srilakshmi posted as ma&ud secretary

రాష్ట్రంలో మరికొందరు ఐఏస్‌ అధికారులను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో తెలంగాణ క్యాడర్‌ నుంచి తాజాగా ఏపీ క్యాడర్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే జలవనరులశాఖలో డిపార్ట్‌మెంట్‌ ఓఎస్టీగా శ్యామలరావును నియమించారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ రిలీవ్‌ కాగానే ప్రస్తుతం ఆయన నిర్వర్తిస్తున్న బాధ్యతలు శ్యామలరావు చేపడతారు. అలాగే సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమించారు.ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ను సునీత కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ap ias transfers- adityanath das as new cs, srilakshmi posted as ma&ud secretary
English summary
andhra pradesh government made certain ias officers transfers today. prinicipal secretary for water resources deaprtment aditya nath das is posted as new chief secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X