వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ.. ఈసారి పదకొండు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీలో మరోసారి పలువురు ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. సీనియర్, జూనియర్ హోదా స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ హోదాలో నలుగురు ఐపీఎస్‌లు ఉండగా, జూనియర్‌ హోదాలో ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీనియర్ హోదాలో ఉన్న నలుగురు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. దాంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏడీజీగా కృపానంద్ త్రిపాఠి ఉజేలా.. లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా కాంతారావు.. SPF డీజీగా టీఎ త్రిపాఠి.. హోంగార్డ్స్ అదనపు డీజీగా హరీష్ కుమార్ గుప్తాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు.

AP IPS OFFICERS TRANSFERS ONCE MORE

పోలీస్‌కు మందుబాబు పోలీస్‌కు మందుబాబు "ముద్దు".. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే అనుకున్నాడేమో..! (వీడియో)

అదే క్రమంలో జూనియర్ హోదా స్థాయి ఐపీఎస్‌లైన ఏడుగురికి స్థానచలనం కలిగింది. రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్.. నర్సీపట్నం ఏఎస్పీగా రిషాంత్ రెడ్డి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అలాగే పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా గరుడ్ సుమిత్ సునీల్‌ను.. గ్రేహోండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్‌ను.. బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా గౌతమి శాలిని ని.. విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వెజెండ్లను.. రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

English summary
Once again many IPS transfers in Andhrapradesh. The government has issued orders to transfer senior and junior IPS officers. The government on Monday decided to transfer four IPSs of senior rank and seven IPSs of junior status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X