వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదల్లోనూ బుద్దాను వదలని మంత్రి అనిల్: చంద్రబాబు ఇంటిని ముంచాలంటే..పోలవరం పైనా..!!

|
Google Oneindia TeluguNews

వరదల సమీక్షలో బిజీగా ఉన్న మంత్రి అనిల్ టీడీపీ నేతలను మాత్రం వదలటం లేదు. వరద నష్టం గురించి వివరిస్తూనే.. తాజాగా బుద్దా వెంకన్న వ్యాఖ్యల మీద మంత్రి స్పందించారు. విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేయడం ఆపకపోతే సీఎం జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. దీని పైన మంత్రి అనిల్ స్పందిస్తూ వాళ్లు ఆత్మహత్యలు చేసుకునేది లేదు.. మనం చూసేది లేదు అంటూ తేల్చి పారేసారు. ఎవరి ఇళ్లు ముంచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరగడంపై స్పందించిన మంత్రి.. టీడీపీ నేతలు ఈ విషయంపై కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు.

వరదతలో రాజకీయమా..

వరదతలో రాజకీయమా..

ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టాయని ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ స్పష్టం చేసారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గిందని చెప్పారు. కొందరు రాజకీయ లబ్ధికోసం వరదను వాడుకుంటున్నారని విమర్శించారు.
ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఆగస్టు 9వ తేదీన శ్రీశైలం, 12వ తేదీన నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామన్నారు. శ్రీశైలం నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పేర్కొన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతోనే నీటి విడుదల జరిగిందన్నారు. పదేళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరద వచ్చిందని గుర్తుచేశారు. గుంటూరులో 6వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని.. పూర్తి స్థాయి వరద నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు.రాయలసీమకు పూర్తిస్థాయి నీటిని వినియోగించేందుకు కృషి​ చేస్తున్నామని తెలిపారు. రాయలసీమకు 35 టీఎంసీల నీటిని మళ్లించినట్టు చెప్పారు. మండిపడ్డారు. టీడీపీ నేతలు ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 ఆత్మహత్య లేదు..చూసేదీ లేదు..

ఆత్మహత్య లేదు..చూసేదీ లేదు..

టీడీపీ నేత బుద్దా వెంకన్నపై మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేయడం ఆపకపోతే సీఎం జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని టీడీపీ నేత బుద్దా వెంకన్న తాజాగా హెచ్చరించారు ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్.. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడాలనే బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటున్నారని విమర్శించారు. వాళ్లు ఆత్మహత్యలు చేసుకునేది లేదు.. మనం చూసేది లేదంటూ తేల్చేసారు. విమర్శలు చేస్తున్న వారికి సరైన స్పష్టత లేదన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఒక్కసారి మాత్రమే గరిష్టంగా 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వివరించారు. నవంబర్‌ 1 నాటికి పోలవరం పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేశారని అభినందించారు.

చంద్రబాబు ఇంటిని ముంచాలంటే...

చంద్రబాబు ఇంటిని ముంచాలంటే...

ఎవరి ఇళ్లు ముంచాలనే ఉద్దేశం తమకు లేదని మంత్రి అనిల్ స్పష్టం చేసారు. నిజంగా చంద్రబాబు ఇంటిని ముంచాలంటే.. 8 కాదు 12 లక్షల క్యూసెక్కులు విడుదల చేసేవాళ్లం అని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల్ని పూర్తిగా నింపుతామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరగడంపై స్పందించిన మంత్రి.. టీడీపీ నేతలు ఈ విషయంపై కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. వరదలకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారని విమర్శించారు. టీడీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా గత కంటే ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని..ప్యాకేజీల రూపంలో టెండర్లు వస్తాయని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ అభ్యంతరాలను క్లియర్ చేస్తున్నామన్నారు. వారికి అన్ని విషయాలు వివిరస్తున్నామని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.

English summary
AP Irrigation minister Anil Kumar announced loss occured in flood effected areas. Anil also cornered TDP leaders on flood politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X