అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజా ప్రభుత్వమా..? పోలీసు రాజ్యమా..? నేతలపై కేసులపై చంద్రబాబు ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఆంధప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు అమరావతి అనువుగా ఉంటుందనే రాజధానిగా ఎంపిక చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తనపై ఉన్న కోపం అమరావతిపై చూపించొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్‌‌రావు చేపట్టిన దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని మార్పు ప్రతిపాదన సరికాదని పేర్కొన్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు జరిపించండి, రాజధాని మార్చడం ఎందుకు..? చంద్రబాబు నాయుడుఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు జరిపించండి, రాజధాని మార్చడం ఎందుకు..? చంద్రబాబు నాయుడు

సంపద సృష్టి..

సంపద సృష్టి..

నవ్యాంధ్రకు సంపదను ఇచ్చే నగరం అమరావతి అని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం రైతులు పోరాడుతుంటే.. సీఎం జగన్‌కు పట్టడం లేదని విమర్శించారు. రైతుల ప్రాణాలంటే ఆయనకు లెక్కలేదని మండిపడ్డారు. కేసులకు భయపడి రాజధాని కోసం పోరాటంపై వెనకడుగు వేయొద్దని సూచించారు. విజయవాడ రాజకీయ చైతన్యానికి మారుపేరని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో గల పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దనే అమరావతి రాజధానిని నిర్మంచామన్నారు.

బెదిరించడం సరికాదు..

బెదిరించడం సరికాదు..


తాను ఏ అధికారిని కించపరచలేదని, గౌరవించానని చంద్రబాబు చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం ప్రతిపక్షాలను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని.. భయభ్రాంతులకు గురిచేస్తే.. రేపు ఆ అధికారం తమకు కూడా రావొచ్చనే విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.

కలిసికట్టుగా..

కలిసికట్టుగా..


రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతోందని.. కానీ పోలీసు రాజ్యం లాగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలపై కక్షసాధింపు చర్యలు సరికాదన్నారు. రాజధాని కోసం పోరాడేందుకు రాజకీయ పార్టీలు జేఏసీగా కలిసిరావాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. అమరావతి రాజధాని ఒక్కరి కోసం కాదని.. సబ్బండ వర్గాలు బయటకొచ్చి ప్రభుత్వం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఫార్మాహబ్‌గా విశాఖ

ఫార్మాహబ్‌గా విశాఖ

తిరుపతిని హార్డ్‌వేర్ హబ్‌గా మార్చాలనుకున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీలో అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. విశాఖపట్టణాన్ని ఫార్మా హబ్, పర్యాటక కేంద్రంగా మార్చాలని అనుకొన్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించామని.. కానీ జగన్ సర్కార్ మాత్రం అభివృద్ది వికేంద్రీకరణ పేరు చెప్పి రాజధానినే మార్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

English summary
andhra pradesh is police state tdp chief chandrabau ask to cm jaganmohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X