కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ పేకాటనా..? మూడు ముక్కలు చేసేందుకు, 70 వేల కోట్ల డేటా సెంటర్ వెనక్కి, చంద్రబాబు ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ను మూడు ముక్కలు చేసేందుకు పేకాట ముక్కల అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అధికార వికేంద్రీకరణ పేరుతో కుంటిసాకులు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్తుందని, ఇందుకు కారణం, సంపద సృష్టించకపోవడమేనని ఉదహరించారు. క్రైసిస్ వల్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. శుక్రవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

సంక్షోభం..

సంక్షోభం..

సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని, వ్యక్తులకు కూడా నగదు చేరుతుందని చంద్రబాబు చెప్పారు. కంపెనీలు నెలకొల్పిన ఆదాయం వస్తోంది.. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఓ వ్యక్తి వస్తువు కొనుగోలు చేస్తే జీఎస్టీ కడతారు, దాచుకొనేంత నగదు ఉంటే ఐటీ కడతారని తెలిపారు. కానీ సంక్షోభం వల్ల ఆదాయం తగ్గిపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్డీపీ పడిపోయిందని, పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని చెప్పారు.

 డేటా సెంటర్ కూడా..

డేటా సెంటర్ కూడా..

రాజధాని మార్పు తుగ్లక్ చర్చ అని చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అమరావతిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, విశాఖపట్టణానికి రాజధాని తరలించడంలో అర్థం లేదన్నారు. విశాఖపట్టణానికి డేటా సెంటర్ తీసుకొస్తే.. దానిని పంపించేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. విశాఖలో డేటా సెంటర్ ఉంటే హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చెందెదనన్నారు.

70 వేల కోట్లతో

70 వేల కోట్లతో

హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్ రావడం వల్ల జరిగిన డెవలప్, వైజాగ్‌లో కూడా జరిగేదని చెప్పారు. 70 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అదానీ ముందుకొస్తే, వారిని వెనక్కి పంపించిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. విశాఖ డేటా వేర్ హౌసింగ్ హబ్ ఏర్పాటయ్యేదని, కానీ దానిని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.

రేకుల షెడ్డులో..

రేకుల షెడ్డులో..

వైజాగ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావించానని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో తాను సీఏఏ కాన్ఫరెన్స్ కోసం వైజాగ్ వస్తే రేకుల షెడ్డులో నిర్వహించామని గుర్తుచేశారు. పరిస్థితి మారుద్దామని ప్రయత్నిస్తుంటే, జగన్ మళ్లీ మొదటికి తీసుకొస్తున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి చేశాక విడిపోవడంతో నవ్యాంధ్రలో అమరావతితోపాటు విశాఖపట్టణం, తిరుపతిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

వికేంద్రీకరణ..

వికేంద్రీకరణ..

తిరుపతిలో టీసీఎల్ హార్డ్ వేర్ కేంద్రం, రిలయన్స్ కంపెనీ నెలకొల్పామని చంద్రబాబు చెప్పారు. అత్యంత వెనుకబడిన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చామని చెప్పారు. కియా మోటార్స్ కోసం మహారాష్ట్ర, తమిళనాడు ప్రయత్నించాయని.. కానీ చివరికి మన వైపే మొగ్గుచూపాయని తెలిపారు. తమిళనాడులో అవినీతి ఉందని వెనక్కి తగ్గిందని ప్రస్తావించారు. కర్నూలు ఓర్వగలుల్లో విమానాశ్రయం నిర్మించామని, శ్రీకాకుళం పైడి భీమవరంలో ఫార్మా ఇండస్ట్రీకి ప్రాధాన్యం ఇచ్చామన్నారు చంద్రబాబు నాయుడు.

కంపెనీలు వెనక్కి

కంపెనీలు వెనక్కి

వైజాగ్‌కు ఐఐఎం, విజయనగరానికి గిరిజన విశ్వవిద్యాలయం, పశ్చిమగోదావరికి ఎన్ఐటీ తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. కానీ జగన్ ప్రభుత్వ చర్యలతో రిలయన్స్, అదానీ, కియా మోటార్స్ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించామని.. కానీ ఇప్పుడు వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేయడం లేదన్నారు.

English summary
ap is state not card: tdp chief chandrababu naidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X