వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి బంద్: ఎమ్మెల్యే గుండు కొట్టించుకుని నిరసన, బోండా ఉమా ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP MLA Gets Head Tonsured, Unhappy Over Funds Allocated to AP

అమరావతి: కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్ బంద్‌లో దాదాపు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. బిజెపి మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళనలో పాలు పంచుకున్నారు.

రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్రలతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్రం ఎపికి అన్యాయం చేసిందంటూ వారు గళమెత్తారు.

బోడె ప్రసాద్ వినూత్న నిరససన

బోడె ప్రసాద్ వినూత్న నిరససన

పెనమలూరు శాసనసభ్యుడుబోడె ప్రసాద్ వినూత్న నిరసన చేపట్టారు. ఉయ్యూరు సెంటర్‌లో కూర్చుని ఆయనయ గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఎపికి న్యాయం చేయాలంటూ గత ఐదు రోజులుగా టిడిపి ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ నిరసన తెలియజేస్తున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

 ఆ రోజు కాంగ్రెసు అలా చేస్తే...

ఆ రోజు కాంగ్రెసు అలా చేస్తే...


అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని హేతురహితంగా విభజించి ఎపి ప్రజలు నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో బయటకు గెంటేసిందని, ఇప్పుడు ఎన్జీఎ ప్రభుత్వం ఎపికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బోడె ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు

కేంద్రం ఆంధ్రులను మోసం చేసింది

కేంద్రం ఆంధ్రులను మోసం చేసింది

ఐదు కోట్ల మంది ఆంధ్రులను కేంద్రం మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు విమర్శించారు. బంద్‌లో భాగంగా ఆయన ఆధ్వర్వంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్దక ఆందోళనకు దిగారు. ఎపికి న్యాయం చేస్తారని చూశామని, చివరి బడ్జెట్‌లో కూడా ఎపికి నిదులు కేటాయించలేదని, ఇది అత్యంత దారుణమైన విషయమని ఆయన అన్నారు.

ఎంపీలు పోరాటం చేస్తున్నా కూడా

ఎంపీలు పోరాటం చేస్తున్నా కూడా

లోకసభలో తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయకపోవడం బాధ కలిగించిందని బొండా ఉమా అన్నారు ఇప్పటి వరకు తాము సానుకూల వైఖరితో ఎదురు చూశామని, కేంద్ర దిగి వచ్చే వరకు వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

English summary
Penamaluru MLA Bode Prasad protested with head save against PM Narendra Modi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X