వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌ సంస్థ కుమి ఉమి ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ...అమరావతిలో పెట్టుబడుల విషయమై వివరణ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామ కృషి కి ఆయన కుమారుడు,ఐటి మంత్రి లోకేష్ తన వంతు చేయూత అందిస్తున్నారు. అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన జపాన్ సంస్థలకు ఆయన ఇక్కడ పెట్టుబడుల వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించారు.

అమరావతిలో పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన జపాన్ సంస్థ కుని ఉమి ఎస్పెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు భేటీ అయ్యారు.

 జపాన్ పెట్టుబడులు...

జపాన్ పెట్టుబడులు...

సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఒక చోట నుంచి మరో చోటుకు తరలించగలిగే పెవిలియన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం, ఐటీ స్పేస్‌ నిర్మాణం, నెస్ట్స్‌ జనరేషన్‌ ఆటో ఎలెక్టిక్‌ వెహికిల్‌ మోడల్‌ సిటీ నిర్మాణం తదిదర ప్రాజెక్టుల నిర్మాణానికి జపాన్ కుమి ఉమి సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం.

 అమరావతి...రెండో టోక్యో....

అమరావతి...రెండో టోక్యో....

ఈ సందర్భంగా ఐటి మంత్రి నారా లోకేష్ కుమి ఉమి ప్రతినిధులతో మాట్లాడుతూ ఎపి సిఎం చంద్రబాబు మదిలోని ఆలోచనలను వారితో పంచుకున్నారు. అమరావతిని రెండో టోక్యో చెయ్యాలనేది చంద్రబాబు ఆకాంక్షగా వారికి వివరించారు. ఆధునాతన వసతులు, మౌలిక సదుపాయాలతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని లోకేశ్‌ వారికి తెలిపారు. గృహ సదుపాయంతో కూడిన ఐటీ పార్కుల అభివృద్ధి కోసం ఐఐటీ పాలసీ తీసుకొచ్చామని జపాన్ ప్రతినిధులకు తెలియజేశారు.

 మరిన్ని అవకాశాలు...

మరిన్ని అవకాశాలు...

విశాఖపట్నం, అనంతపురంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని లోకేష్ జపాన్ కంపెనీ ప్రతినిధులతో చెప్పారు. అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు త్వరలోనే ఈవి పాలసీ తీసుకురాబోతున్న విషయం వారికి తెలియజేశారు.

జపాన్ కు ఆహ్వానం...

జపాన్ కు ఆహ్వానం...

ఇక్కడి పరిస్థితులపై తమకు అవగాహన వచ్చిందని,

త్వరలోనే పూర్తి స్థాయి
ప్రతిపాదనలతో మీ ముందుకు వస్తామని జపాన్ సంస్థ ప్రతినిధులు లోకేష్ తో చెప్పారు.

నెక్స్ట్ జనరేషన్ ఆటో ఎలెక్ట్రిక్ వెహికల్ మోడల్ సిటీ ఏర్పాటు కోసం జపాన్ లో స్టేక్ హోల్డర్స్ తో సమావేశం ఏర్పాటు చెయ్యబోతున్నామని, ఆ సమావేశానికి హాజరు కావడానికి లోకేష్ ను కూడా జపాన్ కు రావాలని ఆహ్వానం పలికారు.

English summary
amaravathi: Andhra Pradesh IT Minister Nara Lokesh on thursday met with a representatives of japan-Kumi company today and exchanged thoughts on setting up a japan city in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X