వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరైన మంత్రి లోకేష్:"మేమూ ఎపికి వస్తాం"...అంటున్న చైనా కంపెనీలు

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపి ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ చైనా పర్యట బిజీబిజీగా సాగుతోంది. మంగళవారం బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం న్యూ ఛాంపియన్స్‌ వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హియర్‌ టెక్నాలజిస్‌ హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ మెలోడీతో లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, కంపెనీ విస్తరణలో భాగంగా ఎపిలో పెట్టుబడులు పెట్టాలి అని కోరారు.

AP IT Minister Nara Lokesh Attended World Economic Forum Meet in China

చైనా పర్యటనలో భాగంగా లోకేష్ హియర్‌ టెక్నాలజిస్‌ సంస్థ ప్రతినిథులతో సమావేశమయ్యారు. ఈ సంస్థ కంటెంట్‌, ట్రాకింగ్‌, లొకేషన్‌ సర్వీసెస్‌, ఐటీ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం హియర్ టెక్నాలజీస్ ఇండియాలో బెంగుళూరులో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతుందని... ఫ్రాంక్లిన్‌, కాన్డ్యూయెంట్‌లాంటి కంపెనీలు విశాఖకు వచ్చాయని చెప్పారు.

ఏపీలో నైపుణ్యం ఉన్న యువతీ, యువకులు ఉన్నారని...విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకు హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామని లోకేష్ వారికి వివరించారు. అక్టోబర్‌లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్‌లో పాల్గొనాల్సిందిగా హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. కంపెనీ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి అని మంత్రి లోకేష్‌ కోరారు.

అంతకుముందు మంత్రి లోకేష్ చైనా పర్యటనలో భాగంగా సోమవారం ఆ దేశానికి చెందిన పలు కంపెనీల ప్రతినిథులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. ఫైబర్‌ కేబుల్‌ సిరీస్‌, డిజిటల్‌ కేబుల్‌ సిరీస్‌, నెట్‌వర్క్‌ క్యాబినెట్స్‌, ఆప్టికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ బాక్స్‌ తదితర పరికరాల తయారీలో సేవలందిస్తున్న హెచ్‌సీటీజీ కంపెనీ ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఒప్పందం చేసుకుంది.

సౌర విద్యుత్‌ సంబంధిత పరికరాల తయారీలో ఉన్న సీఈటీసీ ఎలక్ట్రానిక్స్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అలాగే రైసెన్‌ సోలార్‌ టెక్నాలజీ, సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ కంపెనీలు కూడా ఎపిలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చాయి.

English summary
Amaravathi: AP IT minister Nara Lokesh had a series of bilateral meetings yesterday and today at Beijing with leading Chinese Industrial Companies and prospective investors.  Minister Lokesh attended the World Economic Forum's New Champions Annual Meeting in Beijing on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X