వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Job Calender రిలీజ్ : నో ఇంటర్వ్యూ- ఓన్లీ రాత పరీక్ష :హోదాపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2021-22 జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసారు. ఈ ఏడాదిలో 10, 143 పోస్టుల క సంబంధించిన షెడ్యూల్ ను ముఖ్యమంత్రి ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఇప్పటి వరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పారు. తొలి నాలుగు నెలల కాలంలోనే లక్షా 22 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేసారు. 2.50 లక్షల మందిని సచివాలయల్లో వాలంటీర్లుగా నియమించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక అంగీకరిస్తూ.. వారిని ప్రభుత్వంలో విలీనం చేసామని చెప్పారు. దీంతో 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పుకొచ్చారు.

Recommended Video

Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu
 చేసింది ఇదీ..చేయబోతోంది ఇదీ..

చేసింది ఇదీ..చేయబోతోంది ఇదీ..

దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. మినిమమ్‌ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచామని చెప్పుకొచ్చారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులర్ గా ప్రతీ నెలా ఒకటవ తేదీనే జీతాలు అందేలా కొత్త వ్యవస్థను రూపొందించామని చెప్పారు. ఏపీపీఎస్సీలో గతంలో ఇష్టానుసారం జరిగేదని..ఇప్పుడు పూర్తిగా సంస్కరణలు తీసుకురావటం తో పాటుగా ఉద్యోగాల భర్తీ పైన పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో లక్షా 40 వేల ఉద్యోగాలు రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో భర్తీ చేయాల్సి ఉందని..వాటిని భర్తీ చేయటంతో పాటుగా నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏదీ అమలు చేయలేదని..ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం డ్రామా చేసారని ఎద్దేవా చేసారు.

 ప్రత్యేక హోదా దేవుడి దయ..

ప్రత్యేక హోదా దేవుడి దయ..

ప్రస్తుతం కరోనా తీవ్రత ఉన్నా.. రెవిన్యూ తగ్గిపోయినా..ప్రతికూల పరిస్థితుల్లోనూ సంక్షేమం...అభివృద్ధి ఎక్కడా ఆగలేదని సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఉద్యోగాల భర్తీ సైతం ప్రారంభించామన్నారు. ఇక, ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా..ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించకుండా లేని ప్యాకేజి గురించి ప్రచారం చేసుకుందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో భయపడి హోదా అంశాన్ని వదిలేసారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుండి హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడి తెస్తున్నామని..దేవుడి దయ తో సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

 ఇంటర్వ్యూలు లేవు..రాత పరీక్షలతోనే..

ఇంటర్వ్యూలు లేవు..రాత పరీక్షలతోనే..

అభివృద్ధి..అధికార వికేంద్రకరణ ద్వారా సొంత గ్రామాల్లోనూ ఉద్యోగాలు పొందే అవకాశం దక్కిందన్నారు. ఇక, తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించేదీ ముందుగానే చెప్పటం ద్వారా నిరుద్యోగులు తమ ఉద్యోగాల కోసం సిద్దమయ్యే అవకాశం ఏర్పుడుతందన్నారు. పరీక్షలు పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని..ఎటువంటి అవినీతి.. సిఫార్సులకు అవకాశం ఉండదని స్పష్టం చేసారు. కేవలం రాత పరీక్షల ద్వారానే ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారన్నారు. ఇంటర్వ్యూ విధానం రద్దు చేసినట్లు వెల్లడించారు.

 తాజా క్యాలండర్ ప్రకారం..

తాజా క్యాలండర్ ప్రకారం..

2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు...జూలై-2021 లో ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టులు 1,238 భర్తీ చేయనున్నారు. అదే విధంగా..ఆగస్టు-2021 లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ద్వారా 36 పోస్టులు భర్తీ చేస్తారు. సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450 భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450 నియామకం జరగనుంది. సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450 మందిని నియమించనున్నారు. అక్టోబర్‌ - 2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451 భర్తీ చేస్తారు. నవంబర్‌ -2021 పారామెడికల్‌ సిబ్బంది 5,251 భర్తీ చేయనున్నారు. డిసెంబర్‌ - 2021 నర్సులు 441 మందికి అవకాశం దక్కనుంది. జనవరి -2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240 మందిని భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి -2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000 భర్తీ చేయనున్నారు. మార్చి -2022 లో ఇతర శాఖలు ద్వారా 36 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దీంతో..మొత్తంగా 10,143 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

English summary
AP CM jagan released job calneder for 2021-22. About 10 thousand posts to be filled this academic year. CM Jagan clarifies that there will be no interviews for these jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X