వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో శాసనమండలి సంక్షోభం ... కార్యదర్శి వర్సెస్ చైర్మన్ .. నెక్స్ట్ ఏంటి ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ వెయ్యాలని మండలి చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శికి పంపిన ఫైల్ మరోమారు తిరస్కరణకు గురైంది. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించలేదని , నియమాలు పాటించలేదని సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కుదరదని మండలి కార్యదర్శి ఫైల్ ను తిరిగి చైర్మన్ వద్దకు తిప్పి పంపటం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే రేపింది. మండలి చైర్మన్ వర్సెస్ కార్యదర్శి రగడ ఏపీ శాసన మండలి వ్యవహారంలో కొనసాగుతుంది. అయితే కార్యదర్శిపై సభా ధిక్కరణ చర్యలు తీసుకోవటానికి న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు మండలి చైర్మన్ . మరోవైపు కోర్టు ను ఆశ్రయించాలని భావిస్తుంది టీడీపీ .

ఆ బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే ప్లాన్ లో వైసీపీ .. రివర్స్ స్కెచ్ వేస్తున్న టీడీపీఆ బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే ప్లాన్ లో వైసీపీ .. రివర్స్ స్కెచ్ వేస్తున్న టీడీపీ

 మళ్ళీ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఫైల్ ను తిప్పి పంపిన కార్యదర్శి

మళ్ళీ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఫైల్ ను తిప్పి పంపిన కార్యదర్శి

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లను మండలి కార్యాలయానికి పంపి కమిటీ ఏర్పాటు చెయ్యాలని ఛైర్మన్ షరీఫ్ పంపించిన ఫైల్ ను తిరస్కరించి రూల్‌ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఫైల్‌ మీద రాసి మండలి కార్యాలయ కార్యదర్శి తిప్పి పంపారు . చైర్మన్ మళ్ళీ ఫైల్ పంపి తనకున్న విచక్షణాధికారాల మేరకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నానని వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని హుకుం జారీ చేశారు. మండలి కార్యదర్శి మాత్రం ససేమిరా అంటూ చైర్మన్ పంపిన ఫైల్ ను తిప్పి పంపారు .

మండలి చరిత్రలోనే ఈ పరిణామం తొలిసారి..

మండలి చరిత్రలోనే ఈ పరిణామం తొలిసారి..


మండలి చరిత్రలో ఇటువంటి పరిణామం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి . చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభా ధిక్కరణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అదే జరిగితే మండలి చరిత్రలో ఈ పరిణామం కూడా మొదటిసారే అవుతుంది. మండలిలో సెలెక్ట్‌ కమిటీ వివాదం మండలి కార్యదర్శి మరోమారు ఫైల్ ను తిరస్కరించటంతో పీక్స్ కి చేరిందని చెప్పాలి . ఇక దీనిపై న్యాయ పరంగా ముందుకు వెళ్ళాలని మండలి చైర్మన్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.

ఆర్డినెన్స్ తెచ్చే ప్లాన్ లో వైసీపీ సర్కార్

ఆర్డినెన్స్ తెచ్చే ప్లాన్ లో వైసీపీ సర్కార్

మండలి చైర్మన్ , టీడీపీ స్టెప్ వేసే లోపే అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్‌ చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకోసం న్యాయ నిపుణులతో , ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చలు జరుపుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ప్రోరోగ్‌ వల్ల ప్రభుత్వానికి ఆర్డినెన్స్‌ తెచ్చుకొనే అవకాశం ఏర్పడుతుందని అనుకుంటున్నారు . అయితే ఆర్డినెన్స్‌ తెచ్చినా మళ్లీ అసెంబ్లీ, మండలికి పంపాల్సిందేనని అధికారులు అంటున్నారు . అంతేకాదు కోర్టులో కేసు ఉండటంతో ఈనెల 26 వరకు రాజధానుల తరలింపు సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి వైసీపీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారింది .

అసెంబ్లీకి, మండలికి ఒకే కార్యదర్శి .. ప్రభుత్వ ఒత్తిడే కారణం అంటున్న టీడీపీ

అసెంబ్లీకి, మండలికి ఒకే కార్యదర్శి .. ప్రభుత్వ ఒత్తిడే కారణం అంటున్న టీడీపీ

ఇక అసలు విషయానికి వస్తే అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారిందనేది రాజకీయవర్గాల అంచనా . సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం, మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టీడీపీ పట్టుబడుతున్న తరుణంలో కార్యదర్శి అధికార పక్షం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కోర్టుకు వెళ్ళే ఆలోచనలో టీడీపీ

కోర్టుకు వెళ్ళే ఆలోచనలో టీడీపీ

చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి నిరాకరించడంపై కోర్టుకెళ్తే ఎలా ఉంటుందన్నదానిపై టీడీపీ ఆలోచన చేస్తుంది . ఢిల్లీలో ఉన్న కొందరు సీనియర్‌ న్యాయనిపుణులు, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారి సలహాలను తీసుకుంటుంది . మండలి కార్యదర్శిపై సభా హక్కుల ధిక్కరణ క్రింద విచారణ జరపాలన్న ఆలోచనలో అటు చైర్మన్ , అలాగే ఎమ్మెల్సీలు ఉన్నారు . మండలిలో సభాముఖంగా చైర్మన్‌ చేసిన ప్రకటన సభ నిర్ణయం కిందే లెక్కని, దానిని ధిక్కరించినందుకు కార్యదర్శిని సభాహక్కుల ఉల్లంఘన కింద విచారించాలని వారు అనుకుంటున్నారు .

బడ్జెట్ సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన క్రింద విచారణ చెయ్యాలని ఆలోచన

బడ్జెట్ సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన క్రింద విచారణ చెయ్యాలని ఆలోచన

బడ్జెట్‌ సమావేశాల కోసం వచ్చే నెలలో మండలి సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆ సమావేశాల్లో కార్యదర్శిపై ధిక్కరణ అభియోగం కింద విచారణ చేపట్టే అవకాశమున్నట్టు కనిపిస్తుంది . ఈ విచారణ రెండు రకాలుగా జరపవచ్చని తెలుస్తుంది . ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును సభాహక్కుల సంఘానికి పంపి ఆ సంఘం ఆధ్వర్యంలో విచారణ జరపడం ఒక పద్ధతి అయితే నేరుగా సభ ముందుకే కార్యదర్శిని పిలిపించి అక్కడే విచారణ జరిపి తక్షణమే శిక్ష విధించడం రెండో పద్ధతి. కార్యదర్శిపై సభా హక్కుల విచారణ చేపడితే మండలి చరిత్రలో ఇదే ప్రధమ విచారణ అవుతుంది . ఏది ఏమైనా ఊహించని రాజ్యాంగ సంక్షోభం ఏపీ శాసన మండలిలో నెలకొనటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలో ఉంది .

English summary
It is now a big issue council Secretary sent back the select committee file to the Chairman and he mentioned that the Constitution has not been followed and the rules have not been established for select committee . The Chairman of the Council vs. Secretary controversy in AP will continue to deal with the Legislative Council. The chairman of the council, however, is consulting with legal experts to take action against the secretary. TDP, on the other hand, intends to approach the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X