వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ శాసనమండలి చరిత్ర .. కీలక ఘట్టాలు!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరూ ఊహించని విధంగా ఏపీలో రాజకీయం మలుపులు తిరుగుతుంది. రాజధాని విషయంలో మొదలైన రగడ చివరకు శాసన మండలిని రద్దు చేసేదాకా వెళ్ళింది . అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం ఇదే తొలిసారి కాదు. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఇక వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని ఆయన తనయుడు జగన్‌ రద్దు చెయ్యటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఏపీ శాసన మండలి హిస్టరీ వన్ ఇండియా ప్రత్యేకం .

మండలి రద్దుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ... ఎవరి వాదన కరెక్ట్ ? మండలి రద్దుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ... ఎవరి వాదన కరెక్ట్ ?

 నాడు ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దు కీలక నిర్ణయం

నాడు ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దు కీలక నిర్ణయం


ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి జులై 1, 1958న ఏర్పాటయ్యింది. శాసనమండలి ఏర్పాటైన నాటి నుండి 1983 వరకూ కాంగ్రెస్‌ పార్టీ పాలనే సాగడంతో శాసససభ, మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు . అయితే 1983లో ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఎన్టీఅర్ అసెంబ్లీలో తీసుకుంటున్న నిర్ణయాలకు మండలి పెద్దలు పదేపదే అడ్డు వస్తుండడంతో ఆయన మండలి రద్దు నిర్ణయం తీసుకుని అమలు చేసేశారు .

 రెండు నెలల కాలంలోనే కేంద్రం ఆమోదం

రెండు నెలల కాలంలోనే కేంద్రం ఆమోదం

ఇక అప్పట్నుంచి ఆంధ్రప్రదేశ్ కు శాసనమండలి లేకుండా చాలా రోజులు నడిచింది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉండడంతో మండలిని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 30, 1985న తీర్మానం చేయించారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ఆమోదించింది. దీనికి జూన్‌1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయ్యింది. కేవలం రెండు నెలల కాలంలోనే మండలి రద్దు జరిగిపోయింది .

1990 నుండి మండలి పునరుద్ధరణకు కాంగ్రెస్ యత్నాలు

1990 నుండి మండలి పునరుద్ధరణకు కాంగ్రెస్ యత్నాలు

అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ మండలి పునరుద్ధరణ చెయ్యాలని భావించింది . శాసనసభలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం జనవరి 22, 1990న తీర్మానం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయినా, లోక్‌సభలో రద్దు కావడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలేవీ ఈ బిల్లును పట్టించుకోలేదు. ఇక 2004లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ మండలి పునరుద్ధరణ దిశగా అడుగులు వేశారు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి .

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మండలి పునరుద్ధరణ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మండలి పునరుద్ధరణ

తమ పార్టీలో భారీ ఎత్తున ఉన్న రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించడానికి అనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. అయితే అప్పట్లో మండలి పునరుద్ధరణ ఆసక్తి దాయకంగా నిలిచింది.జులై 8, 2004న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది. దీనికి డిసెంబర్‌ 15, 2005న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.ఇక డిసెంబర్‌ 20, 2005న రాజ్యసభలోనూ ఆమోదం లభించింది.

 దాదాపు మూడేళ్ళ కాలం పట్టిన మండలి పునరుద్ధరణ

దాదాపు మూడేళ్ళ కాలం పట్టిన మండలి పునరుద్ధరణ

దీంతో.. జనవరి 10, 2006న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు అంగీకరిస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు. చివరకు 1985లో రద్దైన మండలి.. మార్చి 30, 2007న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004 నుండి మొదలుపెడితే మార్చి 30, 2007 వరకు మండలి పునరుద్ధరణ జరిగి కార్యాకలాపాలు ప్రారంభించటానికి సమయం పట్టింది.

చుక్కా రామయ్య వంటి మేధావులకు స్థానం కల్పించిన మండలి

చుక్కా రామయ్య వంటి మేధావులకు స్థానం కల్పించిన మండలి


ఇక కొందరు మేధావులను సైతం మండలికి నామినేట్ చేసింది ప్రభుత్వం. చుక్కా రామయ్య తదితరులను అప్పట్లో గవర్నర్ కోటా కింద నామినేట్ చేశారు. ఇక కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల నుంచి సీనియర్లు మండలికి నామినేట్ అయ్యారు. అలా సభ ఒక రూపాన్ని సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన మూడేళ్లకు శాసనమండలి ఏర్పాటు అయ్యింది. ఆ తర్వాత మిగతా వాళ్ల కు అది రాజకీయంగా ఉపకరించింది . ఎన్నికల్లో టికెట్లు లభించని వాళ్లకు, గెలవక పోయినా మంత్రి పదవులు కావాల్సిన వారికి మండలి కలిసి వచ్చింది.

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu
రాజకీయ నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతున్న మండలి నేడు రద్దు తీర్మానం

రాజకీయ నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతున్న మండలి నేడు రద్దు తీర్మానం

వైఎస్ రాజశేఖర రెడ్డి మండలి సభ్యులెవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత మాత్రం అది కొనసాగింది. కిరణ్ కుమార్ రెడ్డి కొందరు ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు.ఇప్పుడు మరోసారి శాసన మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తీర్మానం చేస్తుంది . మండలి రద్దు జరిగితే రాజకీయ నిరుద్యోగులు పెరుగుతారు . అయినప్పటికీ ఏపీ రాజధాని అంశంపై పెట్టిన బిల్లులు ఆమోదం పొందకుండా మండలి వ్యవహార శైలి నచ్చని సర్కార్ అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు ఉన్నారన్న బలంతో గతంలో రద్దు త్వరితగతిన జరిగింది అన్న కారణంతో మండలిని రద్దు చేస్తుంది.

English summary
One of the major changes that happened after late YSR came to power in 2004 was the revival of the legislative council. It was earlier abolished by NTR as it was becoming an obstacle to him in governance. And Now CM YS Jagan Mohan Reddy decided to dissolve the legislative council .Interestingly, it was the father who breathed life into the council and it is the son who is abolishing it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X