వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నో.. సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన, నోటిఫికేషన్ జారీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. ఎన్నికలకు సంబంధించి పాత ఆర్డినెన్స్ కాలం ముగియనుండటంతో.. జగన్ సర్కార్ మరో ఆర్డినెన్స్ జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకే అంశానికి సంబంధించి రెండు ఆర్డినెన్సులు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ప్రభుత్వం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలు/ మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ డిసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది.

 జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ విడుదల: జగన్ సర్కార్‌ నాలుగేళ్లే: మరిన్ని కేసులు జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ విడుదల: జగన్ సర్కార్‌ నాలుగేళ్లే: మరిన్ని కేసులు

ప్రత్యేక అధికారుల పాలన పొడగింపు..

ప్రత్యేక అధికారుల పాలన పొడగింపు..

రాష్ట్రంలో గల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. మొత్తం108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించింది. ఈ ప్రత్యేకాధికారుల పాలన డిసెంబర్‌ 31 లేదంటే పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు కొనసాగుతోంది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రత్యేక అధికారుల పాలన అక్టోబర్‌ 10 వరకు అమల్లో ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. పురపాలక సంఘాల్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 2 తేదీ వరకు ఆయా చోట ప్రత్యేకాధికారుల పాలన అమల్లో ఉంటుంది.

నాలుగైదు నెలల వరకు నో ఎలక్షన్స్..

నాలుగైదు నెలల వరకు నో ఎలక్షన్స్..

కరోనా వైరస్ వల్ల స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటంతో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలక శాఖ స్పష్టం చేసింది. నెపం ఎస్ఈసీ మీద వేసి ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనిని బట్టి చూస్తే వచ్చే నాలుగైదు నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని స్పష్టంగా అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆర్డినెన్స్‌తో ఇబ్బందులు తప్పలేదు. పాత ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో కొత్త ఆర్డినెన్స్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్డినెన్స్‌ చెల్లదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాత ఆర్డినెన్స్‌ ఆధారంగా జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా చెల్లదని చెబుతున్నారు.

 కాలం చెల్లిన ఆర్డినెన్స్..

కాలం చెల్లిన ఆర్డినెన్స్..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పేరుతో ప్రభుత్వం ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్‌ నంబరు 2 జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించే కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ చేసినట్టు రుజువైతే ఐదేళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చొంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనిని అప్పట్లోనే విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.

వాద్వా వర్సెస్ బీహర్ ప్రభుత్వం కేసులో

వాద్వా వర్సెస్ బీహర్ ప్రభుత్వం కేసులో

ఒకే అంశంపై మరో ఆర్డినెన్స్‌ చెల్లదని డీసీ వాద్వా వర్సెస్‌ బిహార్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషనల్‌ కౌన్సిల్‌ ఆర్డినెన్స్‌-1983 అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం తిరిగి ఆర్డినెన్స్‌ జారీ చేసింది. వాద్వా.. మరికొందరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై కోర్టు 1986 డిసెంబరు 20న తీర్పు ఇస్తూ.. ఆర్డినెన్స్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే జారీ చేయాలని తెలిపింది. అంతేకాదు ఇది చట్టసభలకు ప్రత్యామ్నాయం కాదని.. చట్టసభలలో చర్చించకుండా, వాటి ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ దాకా చట్టాల అమలు కుదరని స్పష్టం చేసింది.

Recommended Video

YSRCP MLA Ambati Rambabu Tested COVID-19 Positive,Video Gone Viral || Oneindia Telugu
తప్పని ప్రత్యేక అధికారుల పాలన పొడగింపు

తప్పని ప్రత్యేక అధికారుల పాలన పొడగింపు

1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి ఒకే అంశంపై రెండోసారి ఆర్డినెన్స్‌లు జారీ చేసిన సందర్భాలు లేవని గుర్తు చేసింది. దీనినిబట్టి పంచాయతీరాజ్‌ ఎన్నికల సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండో ఆర్డినెన్స్‌ కూడా చెల్లదు. దీనిపై కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేదు. మొదటి ఆర్డినెన్స్‌కు కాలం చెల్లబోతోంది. రెండోది చెల్లనందున స్థానిక ఎన్నికల ప్రక్రియ రద్దయినట్లే అని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారాల పాలనను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

English summary
local body elections not conducted 5 months in andhra pradesh. government issued notification for special officer ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X