అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో సమావేశాలు, ఎత్తులు..పైఎత్తులు .. టీడీపీతో కలిసి రాజధాని విషయంలో పోరాడేదెవరు ?

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ సమావేశాల సమయం ఆసన్న మవుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న రగడ పై అటు అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే కసరత్తులు చేస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తామేం తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఈరోజు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ టిడిపి, వైసీపీలు రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇక ఇదే సమయంలో టీడీపీ చేసే పోరాటానికి ఏ పార్టీల మద్దతు లభిస్తుంది. ఎవరు టీడీపీకి అండగా నిలుస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది .

వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉల్లిగడ్డ తినావా? ఆ పండు తింటావా? నిర్మలా సీతారామన్‌పై చిదంబరం సెటైర్వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉల్లిగడ్డ తినావా? ఆ పండు తింటావా? నిర్మలా సీతారామన్‌పై చిదంబరం సెటైర్

 రాజధాని అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ

రాజధాని అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ

ఏపీలో రాజధాని మీద రగడ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు రాజధాని పర్యటన సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు చెప్పులతో దాడి చేసిన ఘటన నేపథ్యంలో టిడిపి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఏపీ రాజధానిలో ఏం జరుగుతుంది. ప్రస్తుత సర్కారు ఏపీ రాజధానిని ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో టిడిపి హయాంలో ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఎంతగా ప్రయత్నం చేసింది వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉంది టీడీపి.

నేడు రౌండ్ టే2బుల్ సమావేశం నిర్వహిస్తున్న టీడీపీ

నేడు రౌండ్ టే2బుల్ సమావేశం నిర్వహిస్తున్న టీడీపీ

అంతేకాదు రాజధానిపై రోజుకో రకమైన అపోహలు సృష్టిస్తున్న వైసిపి, రాష్ట్ర రాజధాని విషయంలో చేస్తున్న రగడ రాష్ట్రానికి నష్టం చేస్తుందనే విషయాన్ని టిడిపి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది . అందుకోసం పోరుబాట పట్టింది. అందులో భాగంగా నేడు కలిసి వచ్చే అన్ని పక్షాలను ఒక వేదిక మీదకు చేర్చి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు దేశం పార్టీ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అటు వైసీపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఈ సమావేశానికి టీడీపీ ఆహ్వానించింది. ఇక టీడీపీ నిర్వహించే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్నది మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.

 టీడీపీ సమావేశానికి జనసేన హాజరయ్యే ఛాన్స్... బీజేపీ దూరం

టీడీపీ సమావేశానికి జనసేన హాజరయ్యే ఛాన్స్... బీజేపీ దూరం

అయితే మొదట నుండి టీడీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ టీడీపీ నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళే అవకాశం లేదు. ఒక పక్క కలిసి వచ్చి అందరినీ కలుపుకు ముందుకు సాగుతామని, బీజేపీ అంటే తమకు వ్యతిరేఖత లేదని అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే . కానీ బీజేపీ నాయకులు మాత్రం గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన పోరాటానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంది కానీ చంద్రబాబుతో కానీ టీడీపీ నేతలతో కానీ కలిసి సాగే అవకాశం లేదు. ఇక టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

 వివిధ పార్టీలు , ప్రజా సంఘాలతో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం

వివిధ పార్టీలు , ప్రజా సంఘాలతో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం

అసెంబ్లీ సమావేశాలకు ముందే రాజధానిపై పోరాటం ఉధృతం చేసిన టిడిపి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజా రాజధాని ద్వారా సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలించొచ్చని , కానీ వైసీపీ ప్రభుత్వం రాజధానిపై అనవసరమైన వివాదాలు సృష్టిస్తూ, రాజధాని మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదే అంశంపై వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు అచ్చెన్నాయుడు .

పోటీగా రాజధాని నిజస్వరూపం పేరుతో తుళ్ళూరులో వైసీపీ సమావేశం

పోటీగా రాజధాని నిజస్వరూపం పేరుతో తుళ్ళూరులో వైసీపీ సమావేశం

ఇక టీడీపీ ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా వైసీపీ కూడా మరో సమావేశం నిర్వహిస్తోంది. వైసీపీ రాజధాని నిజ స్వరూపం పేరిట ఇవాళ తుళ్లూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఉదయం 11 గంటలకు వైసీపీ నేతలు తుళ్లూరు వాసులతో సమావేశమవుతున్నారు . గతంలో రాజధాని పేరిట జరిగిన మోసాన్ని సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి, పోటాపోటీ సమావేశాలతో నేడు రాజధానిపై ఏపీలో హాట్ డిస్కషన్ జరగనుంది.

English summary
The politics of the AP are heating up as the time for assembly meetings is nearing. Both the ruling and opposition parties have been actively engaged in the controversy of the AP capital. The TDP and the YCP are holding political meetings in the state about capital issue today . tdp conducting a round table meeting by after noon and the ycp conducting the meeting in tulluru about capital .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X